KTR: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగియడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని.. ప్రజాసేవకు కాదు అంటూ ట్విట్టర్ (X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

New Update
KTR: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

MLA KTR: తెలంగాణలో నిన్నటితో (బుధవారం) సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఈ క్రమంలో గ్రామాలల్లో సర్పంచుల పదవీవిరమణ సన్నాహాలు జరుగుతున్నాయి. సర్పంచుల పదవి విరమణపై కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు అంటూరాసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోయిందని పేర్కొన్నారు.

ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన

మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ (X) లో.. "సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు!. ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు.కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ 🙏 " అంటూ రాసుకొచ్చారు.

ఇదిలా ఉండగా హైకోర్టుకు సర్పంచులు..

తమ పదవీ కాలం ముగియడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో స్టే కు హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ALSO READ: త్వరలోనే సీఎం రేవంత్‌ని కలుస్తా.. మల్లారెడ్డి కీలక ప్రకటన.. కాంగ్రెస్‌లోకి జంప్?

లోక్ సభ ఎన్నికల తరువాతే..?

రాష్ట్రవ్యాప్తంగా 2019లో బాధ్యతలు స్వీకరించిన సర్పంచుల పదవీ కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. సర్పంచుల వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా రికార్డులు అప్పజెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తే సర్పంచులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. సర్పంచుల స్థానంలో అధికారుల పాలన అందుబాటులోకి వస్తే గ్రామ కార్యదర్శికి, ప్రత్యేక అధికారికి జాయింట్ చెక్ పవర్ ఉంటుందని టాక్. సర్పంచ్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని పలు మండలాల్లో సర్పంచులు ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు