KTR: కాంగ్రెస్ శ్వేతపత్రం తప్పుల తడక.. అబద్ధాల పుట్ట : కేటీఆర్ స్వేదపత్రం లైవ్

అరవై ఏళ్ల పాలనలో తెలంగాణ కోసం రూ.4,98,053 కోట్లు ఖర్చు చేస్తే.. తమ హయాంలో గత పదేళ్లలో రూ.13,72,930 కోట్లు ఖర్చు చేశామన్నారు కేటీఆర్. సంక్షోభం నుంచి సంవృద్ధి వైపు తెలంగాణను నడిపించామన్నారు. తెలంగాణను విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం సాగుతోందని ఫైర్ అయ్యారు.

New Update
KTR: కాంగ్రెస్ శ్వేతపత్రం తప్పుల తడక.. అబద్ధాల పుట్ట : కేటీఆర్ స్వేదపత్రం లైవ్

Swetha Patram : తమ పాలనలో సంక్షోభం నుంచి సంవృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. విధ్యంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువచ్చామన్నారు. 60 ఏళ్ల గోసను పదేళ్లలో మాయం చేశామన్నారు కేటీఆర్. కరోనా కారణంగా రెండేళ్లు, పెద్దనోట్ల కారణంగా కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కాంగ్రెస్(Congress) తమపై చేసిన ఆరోపణలను ధీటుగా ఎదుక్కొన్నామన్నారు. ఎన్నికలు పోనూ తమకు అభివృద్ధి కోసం ఆరున్నరేళ్లు మాత్రమే మిగిలిందని వివరించారు కేటీఆర్.

తమ పాలనలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మిగిలిందన్నారు. లేని అప్పులను కూడా ఉన్నట్లుగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఫైర్ అయ్యారు. కార్పొరేషన్లు తెచ్చుకున్న అప్పులను కూడా ప్రభుత్వ అప్పులతో ఎలా కలుపుతారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలంగాణను విఫల ప్రయత్నంగా చూపెట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. తాము కేవలం తెలంగాణకు ఆస్తులతో పాటు.. అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ తమదన్నారు.

అరవై ఏళ్లలో గత ప్రభుత్వాలు తెలంగాణ కోసం రూ.4,98,053 కోట్లు ఖర్చు చేస్తే.. తమ పాలనలో గత పదేళ్లలో రూ.13,72,930 కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా ఈ రోజు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం ప్రజెంటేషన్ ఇస్తున్నారు కేటీఆర్. ఆ లైవ్ ను కింది వీడియోలో చూడండి. - 

Advertisment
Advertisment
తాజా కథనాలు