Uppal : మేడ్చల్‌ పీర్జాదిగూడలో టెన్షన్‌..టెన్షన్‌

మేడ్చల్ పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్‌ రెడ్డి లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

New Update
Uppal : మేడ్చల్‌ పీర్జాదిగూడలో టెన్షన్‌..టెన్షన్‌

BRS Corporators Arrested : మేడ్చల్ (Medchal) పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సీలింగ్‌ భూమిలోని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్‌ రెడ్డి అధికారులను అడ్డుకున్నారు.

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ (BRS) కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్‌ రెడ్డిలు అధికారులతో వాదోపవాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి పై పీర్జాదిగుడా మేయర్‌ వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. పీర్జదిగూడా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్ పార్టీ (Congress Party) మేయర్‌ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమస్తులను కూడబెట్టుకోవాలనే కుట్రలో భాగమే ఈ కూల్చివేతలని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారుల పై కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఒత్తిడి తీసుకుని వచ్చి నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయంటున్న బాధితులు వాపోతున్నారు.HMDA, రెవెన్యూ అధికారులు మా స్థలాలకు NOC ఇచ్చారని వారు తెలిపారు. పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుగోలుచేసి..నిర్మించుకున్న భవనాలను కూల్చివేస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు