KCR: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. కేసీఆర్ ఎమోషనల్ TG: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత అని అన్నారు కేసీఆర్. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. By V.J Reddy 25 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR: బీజేపీ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిస్తే ఒక్క రూపాయి పని అయినా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత. పార్లమెంట్లో ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడుతూ... పదేళ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దళిత, పేద మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మోదీ పాలనలో రూపాయి డాలర్ మారకంతో 83కు పడిపోయిందన్నారు. ఒక పార్టీయేమో దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే... ఇంకో పార్టీయేమో ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పట్టుకొని ఓటు అడుగుతోందని ఎద్దేవా చేశారు. యాదాద్రి దేవాలయాన్ని నిర్మించిన మనం ఎప్పుడూ ఆ గుడిని చూపించి ఓటు అడగలేదన్నారు. తాము ఎవరికో బీ టీమ్ అంటూ ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయని... కానీ భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయి బీఆర్ఎస్ చైర్మన్‌ను దించేశాయని మండిపడ్డారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే బీజేపీ అక్షితలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు అంటోందని... వీటితో కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు బోర్లకు మీటర్లు పెట్టమని హెచ్చరించినా తాను తలొగ్గలేదన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే కనుక మోటార్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. మోదీ అధికారంలోకి రాగానే ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పజెప్పారన్నారు. మోడీ లేకుండా, బీజేపీ లేకుండా కేంద్రంలో ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలంగాణకు మంచి లాభం జరిగేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు నష్టం జరిగింది బీజేపీ వల్లే అని ఆరోపించారు. #kcr #bjp #modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి