/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-2-jpg.webp)
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కారణంగా జులై 15న సిఫారసు లేఖలు ఏవి కూడా అనుమతించడం కానీ, స్వీకరించడం కానీ జరగదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని అధికారులు కోరారు.
తిరుపతి శ్రీనివాసమంగాపురం కల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి తీసుకుని వచ్చారు.
NO VIP BREAK ON JULY 16
RECOMMENDATION LETTERS WILL NOT BE ENTERTAINED ON 15 JULY
Following the Salakatla Anivara Asthanam on July 16 in Tirumala Temple. TTD has canceled the VIP break darshan on that day as such recommendation letters will not be entertained on July 15. pic.twitter.com/gQWXzfoFfe
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) July 13, 2024
అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం చేశారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
Also read: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్