tirumala: నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..చక్రస్నానం ప్రత్యేకతలు తెలుసా..!! శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శ్రీవారిని వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. ఇక బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న రథోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అనుగ్రహం ఇచ్చారు. భక్త జనసందోహం నడుమ రథోత్సవం ఘనంగా మొదలై.. రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట స్వామివారిని తిప్పారు. గోవింద.. గోవిద.. నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. By Vijaya Nimma 26 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి కలియుగ దైవంగా భక్తులు నమ్మి కొలిచే ఏడుకొండల వాడైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. మంగళవారం చివరిరోజైన పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం వేడుకగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. పుణ్యస్నానాలకు అనుమతి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం నిర్వహించనున్నారు. బుదవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు పుష్కరిణీలో పవిత్ర స్నానం అర్చకులు ఆచారిస్తారు. సుదర్శన చక్రతాళ్వార్ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత పుణ్యస్నానాలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని, భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నవరాత్రులకు తిరుమల క్షేత్రం సిద్ధం శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవోపేతంగా నిర్వహించింది. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై.. వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించి భక్తులకు పెద్దపీట వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు.. పలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది టీటీడీ. మరోవైపు అక్టోబర్15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్దం అవుతుంది. ఎన్నోజన్మల పుణ్యఫలం బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యాక పరమాత్మ సుదర్శనస్వామిని ముందు ఉంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అంటారు. బ్రహ్మోత్సవం అంటే యజ్ఞం.. యజ్ఞం పూర్తి చేయగానే అవభృధ స్నానం చేయాలి. భృధం అంటే బరువు.. అవ అంటే దించుకోవడం అని అర్థం. ఇన్ని రోజులు యజ్ఞం చేసి అలిసిపోయిన వాళ్లు ఆ అలసట.. బరువును స్నానంతో ముగించు కుంటారు. యజ్ఞంలో పాల్గొన్న వారు అవభృంధంలో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుంది. చక్రస్నానం రోజు సుదర్శనస్వామి, మలయప్పస్వామితో కలిసి స్నానం చేసే వారు మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకొని ఉంటారు. #tirumala #ttd #brahmotsavams #end-today #special-in-chakrasnanam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి