స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Karthik 29 Aug 2023 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి స్కూల్ బస్సు కింద పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో చోటు చేసుకుంది. శివాన్షు(3) తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లిపాటు వెళ్లాడు. మృతుడి తల్లి తన పెద్ద కుమారుడ్ని బస్సు ఎక్కించే పనిలో ఉండగా.. చిన్న కుమారుడు ఆడుకుంటూ బస్సు ముందువైపు వెళ్లాడు. బస్సు ముందు బాలుడు ఉండటాన్ని గమనించని స్కూల్ బస్సు డ్రైవర్.. బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడ్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో శివాన్షు తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్ధలికి చేరుకున్న పొలీసులు చికిత్స నిమిత్తం బాలుడ్ని స్థానిక అస్పత్రికి తరలించారు. కాగా బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా అన్నయ్యకు టాటా చెబుదామని వచ్చిన తమ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తల్లిదండ్రులు రోధించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ప్రభుత్వం పూర్తిస్థాయిలో డ్రైవింగ్ రాని వారికి సైతం లైసెన్స్‌లు ఇస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. వారి డ్రైవింగ్‌తో చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యాలు బస్ ఫిట్‌గా లేకున్నా వాటిని నడుపుతున్నారని, బస్సులో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నట్లు ఆరోపించారు. దీని వల్ల బస్సు ప్రమాదానికి గురైతే విద్యార్ధుల ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్ధితి ఉందని తెలిపారు. ఫిట్‌నెస్ లేని బస్సులను నడుతున్న స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #school-bus #died #hanmakonda #chinnari #chanteyapalli #shivanshu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి