Bourn Vita: బోర్నవీటాను ఆ లిస్ట్‌లో నుంచి తీసేయండి..కేంద్రం కీలక ఆదేశాలు

చిన్నపిల్లలు ఇష్టంగా తాగే బోర్నవీటా ఇంక మీదట హెల్త్ డ్రింక్ కాదు. దీన్ని హెల్త్‌ డ్రింక్స్ జాబితాలో నుంచి తీసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేవాలు జారీ చేసింది. బోర్న్‌విటాతో పాటు అన్ని రకాల పానీయాలను ఈ కేటగిరి నుంచి తొలగించాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది.

New Update
Bourn Vita: బోర్నవీటాను ఆ లిస్ట్‌లో నుంచి తీసేయండి..కేంద్రం కీలక ఆదేశాలు

బూస్ట్, బోర్నవీటా...పిల్లలకు ఇషంగా తాగే చాక్లెట్ పానీయాలు. ఇవి తాగితే బోలెడంత శక్తి వస్తుంది అంటూ ప్రచారం చేస్తారు. పిల్లల్ంలో ఎదుగుదలకు బోర్నవీటా తోడ్పడుతుంది. దీనిలో రకరకాల విటమిన్లు ఉన్నాయని యాడ్స్‌లో చెబుతారు. దీన్ని నమ్మి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బోర్నీటాను అలవాటు కూడా చేశారు. అయితే ఇది శరీరానికి ఏమీ హానీ చేయకపోయినా...హెల్త్ డ్రింక్ మాత్రం కాదని అంటోంది కేంద్రం. బోర్నవీటాను హెల్త్ డ్రింక్ లిస్ట్‌లో నుంచి తీసేశాయలని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్స్ నుంచి తొలగించాలని సూచించింది.

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, 2005 సెక్షన్ (3) కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ, CPCR చట్టం, 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ, మోండెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు, నిబంధనలు బోర్నవీటాలో లేవని..అందుకే ఇది హెల్త్ డ్రింక్ కిందకు రాదని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరోవైపు బోర్నవీటాలో సుగర్ లెవల్స్ చాలా ఎక్కువ ఉందని కూడా చెప్పింది. పిల్లలకు ఆమోదయోగ్యమైర పరిమితలను దాటి సుగర్స్ ఈ బోర్నవీటాలో ఉన్నాయని ఎన్‌సిపిసిఆర్ పరిశోధనలో తేలింది. దాంతో పాటూ వీటిని పవర్ సప్లిమెంట్స్, హెల్త్ డ్రింక్స్‌గా చెబుతున్న కంపెనీల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎన్‌సీపీసీఆర్ ..భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది.

Also Read:Sukhesh Chandra: నన్ను బెదిరిస్తున్నారు…తీహార్ జైలు నుంచి సుకేశ్ చంద్ర మరో లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు