/rtv/media/media_files/2025/04/08/xkzoYXRBGHnNLYmP5uf3.jpg)
Pawan Kalyans Son Mark Shankar
Pawan Son Accident : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అక్కడి పాఠశాలలో చదువుతున్న శంకర్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. విశాఖ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
" సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఉప్పూనిప్పూలా పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని.. నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025
Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మార్క్ శంకర్ ప్రమాదంపై స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు."సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను
— KTR (@KTRBRS) April 8, 2025
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy
ఇక వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూడా మార్క్ శంకర్ ఇవనోవిచ్ ప్రమాదంపై ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుషు మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ రోజా ట్వీట్ చేశారు.
ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025
మరోవైపు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకూడా ట్విట్ చేశారు.సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏.అని ఆయన ట్విట్ చేశారు.
సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏.
— SVSN Varma (@SVSN_Varma) April 8, 2025
Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
Minister Botsa : వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన మంత్రి బొత్స.. మా పార్టీ విధానం ఇదే..!
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు మంత్రి బొత్స. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని కామెంట్స్ చేశారు.
Capital Issue: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ ను మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యాలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
తెలంగాణ జోలికి రావొద్దు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి పదేళ్లు కావస్తోందని.. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని.. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి.. కానీ, మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు.
Also Read: ఏపీ రాజకీయాల్లోకి కొత్త నేతలు రాక.. మంత్రి విడదల రజినీకు ధీటుగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!
విభజన హామీల సాధనే..
ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana).హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగించాలనేది మా విధానం కాదన్నారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమన్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కూడా కాదని చెప్పుకొచ్చారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అంటూ ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరంటూ వ్యాఖ్యానించారు.
వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా?
కాగా, 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తి కావొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఇష్యూ నడుస్తున్న ఈ సమయంలో.. సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరగనుంది అని ఉత్కంఠ నెలకొంది.
Pawan Son Accident : నా ఆలోచనలన్నీ ఆ కుటుంబం గురించే.. వైఎస్ జగన్ సంచలన ట్విట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్‌లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!
మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్
అలేఖ్య సిస్టర్ రమ్య ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ‘ఒక ఆడపిల్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని బతకనివ్వరా. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!
హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Son: పవన్ చిన్న కుమారుడిని సింగపూర్‌లో ఎందుకు చదివిస్తున్నాడో.. కారణం తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌లో ప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Maoist: కర్రీగుట్టపై కాలుపెడితే ఖతమే.. పోలీసులకు మావోయిస్టుల వార్నింగ్!
71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు
Lucknow Chandrika Devi Temple : వామ్మో..ఇదేక్కడి రౌడీయిజంరా నాయనా..ప్రసాదం కొనకపోతే కొట్టేస్తారా?
Crime: డెలివరీ అయిన మూడు రోజులకే వారి ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు.. టెక్ బిలియనీర్ భార్య సంచలనం!
TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే