Bomb Blast: ఎన్నికల వేళ బాంబు పేలుడు.. బాలుడి మృతి!

ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఒక పట్టణంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఆడుకునే బంతిలా కనిపించడంతో దానితో ఆడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారులలో ఒక బాలుడు ఈ ఘటనలో మృతి చెందగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Bomb Blast: ఎన్నికల వేళ బాంబు పేలుడు.. బాలుడి మృతి!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఎన్నికల ప్రచార సభకు కొన్ని గంటల ముందు ఘోర విషాదం చోటుచేసుకుంది. హుగ్లీ జిల్లాలోని పాండువాలో సోమవారం చిన్నారులు బంతిలా భావించి ఆడేందుకు ప్రయత్నించడంతో అది బాంబులా పేలడం(Bomb Blast)తో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అతని స్నేహితులు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఎన్నికల సమయం కావడంతో ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంది. మే 20న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు దాడులకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకున్నారని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అయితే, ఈ బాంబు(Bomb Blast) ముగ్గురు పిల్లల్లో ఒకరి తండ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి మాజీ భార్యను అరెస్టు చేశారు.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని పాండువా గ్రామంలో నతాజీ కాలనీకి చెందిన బాలుడు రూపమ్ బల్లాబ్ (11) ఇంటి పెరట్లో ఉన్న చెరువు పక్కన రాజ్ బిస్వాస్, సౌరవ్ చౌదరి (12), రూపమ్ అనే ఆరో తరగతి విద్యార్థి ఆడుకుంటున్న సమయంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పేలుడు(Bomb Blast) సంభవించింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన చిన్నారులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజ్ బిస్వాస్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులకు చేతులు, కాళ్లపై తీవ్రగాయాలు కావడంతో వారిని చిన్‌సురాలోని సూపర్‌ ఫెసిలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. పొరుగున ఉన్న బుర్ద్వాన్‌కు చెందిన రాజ్ వేసవి సెలవుల్లో గడిపేందుకు పాండువాలోని తన తల్లి బంధువుల ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: మనకు పోటీలేదు.. ఆర్ధిక వృద్ధిలో భారత్ పరుగులు.. చైనా.. అమెరికా వెనక్కి.. 

మాజీ భార్యపై ఫిర్యాదు
"ఇద్దరు వ్యక్తులపై తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేశారు.  మేము రీటా వల్లభ్‌ను అరెస్టు చేసాము. మరొకరి కోసం వెతుకుతున్నాము. వారికి పేలుడు పదార్థాలు(Bomb Blast) ఎక్కడ నుండి వచ్చాయి..  వారి ఉద్దేశ్యం ఏమిటనే దానిపై మేము ప్రయత్నిస్తున్నాము" అని పోలీసులు తెలిపారు.

తన మాజీ భార్య, ఆమె ప్రేమికుడు బాంబు పెట్టారని రూపమ్ తండ్రి సుఖదేబ్ బల్లభ్ ఆరోపించారు. "నన్ను చంపడానికే ఈ బాంబు పెట్టాడు.. విడాకులు తీసుకున్నా.. మా మాజీ భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపాలనుకుంటున్నారు. వారి నీచమైన పనికి ఓ అమాయక బాలుడు బలి అయ్యాడు. నా కొడుకు కూడా ప్రాణాలతో పోరాడుతున్నాడు" అని కన్నీటిపర్యంతమయ్యాడు. 

బిజెపి-టిఎంసి మాటల యుద్ధం..
సోమవారం ఇదే భాగంలో అభిషేక్ బెనర్జీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీంతో ఈ బాంబు పేలుడు రాజకీయంగా దుమారం రేపింది. రోడ్‌బ్లాక్‌పై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. హుగ్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి లాకెట్ ఛటర్జీ మాట్లాడుతూ, మాకు భారీ స్పందన వస్తున్నందున ప్రజల్లో భయాన్ని కలిగించడానికి TMC ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. మృతుడి ఇంటిని కూడా సందర్శించారు. అయితే, "లాకెట్ ఛటర్జీ స్వయంగా బయటి వ్యక్తులతో కలిసి రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. కాబట్టి బాంబును(Bomb Blast) ఎవరు తీసుకువచ్చారో స్పష్టంగా తెలుస్తుంది" అని TMC జిల్లా అధ్యక్షురాలు అసీమా పాత్ర ప్రతిస్పందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు