Maharaj: ఓటీటీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ వివాదాస్పద చిత్రం..? స్ట్రీమింగ్ ఎక్కడంటే..? అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మహారాజ్'. ఈ మూవీని రిలీజ్ చేయకూడదంటూ ఇటీవలే గుజరాత్ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా మూవీని విడుదల చేయవచ్చని ఆదేశించింది హైకోర్టు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. By Archana 23 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Maharaj OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మహారాజ్'. సిద్దార్థ్ పి మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. రిలీజ్ కు ముందే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కోర్టులో కేసు అయితే జూన్ 14 ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. వివాదాల కారణంగా వాయిదా పడింది. సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటు కోర్టులో కేసు వేశారు హిందు సంఘాలు. విచారణ చేపట్టిన గుజరాత్ హై కోర్టు సినిమాను విడుదల చేయకూదంటూ నిర్మాణ సంస్థకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడగా.. తాజాగా మూవీని రిలీజ్ చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది గుజరాత్ హైకోర్ట్. నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం మహరాజ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన న్యాయ పోరాటాలలో ఒకటిగా పరిగణించబడే 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో జునైద్ ఖాన్ మెయిన్ లీడ్ గా నటించగా.. ఖాన్, జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే, శర్వరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. Also Read: Chutney Sambar: కమెడియన్ యోగి బాబు ‘చట్నీ- సాంబార్’.. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో..! #aamir-khan #netflix #maharaj #junaid-khan-maharaj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి