Swara Bhaskar: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు స్వరా దంపతులు. ఈ నెల 23న తమకు కూతురు జన్మించారని.. బేబి పేరు రబియాగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. By BalaMurali Krishna 25 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Swara Bhaskar: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు స్వరా దంపతులు. ఈ నెల 23న తమకు కూతురు జన్మించారని.. బేబి పేరు రబియాగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. స్వర దంపతులకు బిడ్డ జన్మించిన నేపథ్యంలో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరి 6, 2023న సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ను స్వరా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకుని.. ఆ తర్వాత మార్చిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. అనంతరం మూడు నెలలకే గర్భం దాల్చినట్లు ఆమె ప్రకటించారు. 'కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇదొక గొప్ప అనుభూతి. చాలా ఆతృతగా ఉన్నాం'' అని భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. A prayer heard, a blessing granted, a song whispered, a mystic truth.. Our baby girl Raabiyaa was born on 23 Sept. 2023 ♥️ With grateful and happy hearts we thank you for your love. It’s a whole new world 🤗✨@FahadZirarAhmad pic.twitter.com/uT7DbvgUXp — Swara Bhasker (@ReallySwara) September 25, 2023 రాజకీయ నేత ఫహాద్‌తో ఆమె పరిచయం, ప్రేమ గురించి స్వరా భాస్కర్ గతంలో ఓ నోట్ కూడా విడుదల చేశారు. ''కొన్ని సార్లు మన పక్కనే ఉన్న వాటి కోసం మనం చాలా దూరం వెతుకుతాం. మేం ప్రేమ కోసం వెతికాం. అయితే మొదట మా మధ్య స్నేహం ఉందని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ప్రేమలో పడ్డాం. నా హృదయంలోకి ఫహాద్ జరార్ అహ్మద్‌కు స్వాగతం. నా హృదయం కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ అది నీదే'' అందులో తెలిపారు. స్వరా భాస్కర్ తల్లి బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళ. అయితే ఆమె తండ్రి నేవీ ఉద్యోగి ఉదయ్ భాస్కర్ తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఫహాద్ జరార్తో వివాహం కంటే ముందు రచయిత హిమాన్షు శర్మతో స్వరా భాస్కర్ కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారని హిందీ చిత్రసీమ వర్గాలు పేర్కొన్నాయి. 'రాంఝనా' చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య మొదలైన పరిచయం ఆ తర్వాత సహజీవనానికి దారి తీసిందని తెలిపాయి. ఐదు సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయారని చెప్పాయి. అనంతరం ఆమె ఫహాద్‌తో ప్రేమలో పడి ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా చదవండి: బాహుబలి2 ను క్రాస్ చేసిన జవాన్ #bollywood #movies #swara-bhaskar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి