Deepika Padukone: నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న దీపికా పడుకోన్

బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ ప్రస్తుతం గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న ఆమె ఇవాళ తెల్లవారు ఝామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి అలిపిరి కాలిబాట మార్గంలో సామాన్య భక్తులతో కలిసి కొండెక్కారు దీపికా.

New Update
Deepika Padukone: నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న దీపికా పడుకోన్

Deepika Padukone at Tirumala: ఎంత గొప్పవారు, సెలబ్రిటీలు అయినా తిరుమల శ్రీవారి ముందు మామూలు వారే. అందరితో సమానంగా దర్శనం చేసుకోవల్సిందే. ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్..నేను కూడా అందుకు అతీతం కాదు అని చూపించారు. సామన్య భక్తురాలిలా మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ తిరుమల కొండెక్కి స్వీమివారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి అలిపిరి మార్గంలో తన సిబ్బందితో నడుచుకుంటూ వెళ్ళారు. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా పదుకుణె తో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. కొండెక్కాక తిరుమల లోని రాధేయం అతిధి గృహానికి చేరుకున్న దీపికా (Deepika Padukone) అక్కడే బస చేశారు.

Also read:మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..సీరీస్ సమం చేసి భారత్

ఇక ఈరోజు ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, వీఐపీ విరామ సమయం లో స్వామి వారిని దీపిక దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమె చేత ప్రత్యేక పూజలు చేయించారు. తర్వాత వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీని తర్వాత దీపికా ముంబై తిరిగి వెళ్ళిపోయారని తెలుస్తోంది. మరోవైపు నిన్న శ్రీవారిని దాదాపు 57 వేల మంది భక్తులు దర్శించకున్నారు. స్వామివారి నిన్న ఒక్కరోజు ఆదాయం 3.97 కోట్లు అని ఆలయ అధికారులు చెబుతున్నారు.

Also read:టమాటాలు ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు