Varun Dhawan : సమంత ముందే తెలుగులో పాట పాడి అదరగొట్టిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ 'సిటాడెల్ : హనీ బన్నీ' వెబ్ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో సమంత నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన పాట ‘నేనే నానీనే సాంగ్' అని అన్నారు. ఇదే సాంగ్ ను సమంత ముందే తెలుగులో పాడి అలరించాడు.

New Update
Varun Dhawan : సమంత ముందే తెలుగులో పాట పాడి అదరగొట్టిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్

Bollywood Actor Varun Dhawan : బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ తన తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, న్యాచురల్ స్టార్ నాని, సమంత జంటగా నటించిన 'ఈగ' మూవీలోని 'నేనే నానినే నేనీ నానిన' అనే పాట తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని వినూత్న కథలు, అద్భుతమైన సంగీతం తనను ఎంతగా ఆకట్టుకున్నాయో వివరించారు.

'నేనే నానినే' పాటలోని లిరిక్స్, మెలోడియస్ ట్యూన్ తనను ఎంతగా ఉత్సాహపరిచాయో తెలిపారు. సమంతతో అతను కలిసి యాక్ట్ చేసిన 'సిటాడెల్ : హనీ బన్నీ' వెబ్ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో వరుణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే ఈసారి 'సిటాడెల్ : హనీ బన్నీ' సిరీస్ తో రాబోతున్నారు.

Also Read : ‘దేవర’ సెకండ్ సింగిల్ అప్డేట్.. లవర్ బాయ్ గా ఎన్టీఆర్, జాన్వీతో అదిరిపోయే డ్యూయెట్..!

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సిరీస్ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మూవీ టీం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సంద‌డి చేసింది. ఈ క్రమంలోనే వరుణ్ స్టేజ్ పై సమంత ముందే తెలుగులో పాట పాడి అదరగొట్టాడు. ఈ ఈవెంట్ లో వరుణ్ మాట్లాడుతూ.. స‌మంతతో చేయ‌డం చాలా బాగ అనిపించింది. తాను సినీయ‌ర్ న‌టి అయిన అలా క‌నిపించ‌లేదు.

ఇక సమంత నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన పాట ‘నేనే నానీనే సాంగ్. ఈగ సినిమాలోని నేనే నానినే నేనీ నానినే అనే పాట చాలా ఇష్ట‌మ‌ని షూటింగ్ టైంలో ఈ పాట‌కు మ‌నం కలిసి రీల్ చేద్దామ‌ని చాలా సార్లు స‌మంత‌ను అడిగాను. అంటూ స‌మంత ముందు పాడి వినిపించాడు వ‌రుణ్ ధ‌వ‌న్ ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు