Filmfare Awards 2024 : ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. యానిమల్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ పంట! బాలీవుడ్ 69వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక గుజరాత్ లోని గాంధీనగర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా, రణ్‍బీర్, ఆలియా ఉత్తమ నటీ నటులుగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు అందుకున్నారు. By Archana 29 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Filmfare Awards 2024 : బాలీవుడ్(Bollywood) ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫెయిర్ అవార్డ్స్(Film Fair Awards 2024) విజేతల జాబితా విడుదలైంది. 69 వ ఫిలిం ఫెయిర్ వేడుక ఆదివారం రాత్రి గుజరాత్(Gujarat) లోని గాంధీనగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) హోస్టింగ్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, వరుణ్, వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ఈవెంట్ అట్ట హాసంగా జరిగింది. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల(69th Edition of Filmfare Awards) వేడుక సందర్భంగా 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. పలువు సినీ నటులు వివిధ క్యాటగిరీలో అవార్డులు అందుకున్నారు. ఈ జాబితాలో ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవలే విడుదలైన 12th ఫెయిల్ మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. బయోగ్రాఫికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. 12th ఫెయిల్(12th Fail) డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‍బీర్ కపూర్, ఆలియా భట్.. యానిమల్(Animal), రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రాలకు ఉత్తమ నటీనటులుగా ఎంపికైనందున స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. యానిమల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా రణ్‍బీర్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి ఆలియా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 2024 ఫిలిం ఫెయిర్ అవార్డుకు ఎంపికైన విజేతల జాబితా ఇదే.. ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్ ) ఉత్తమ నటుడు: రణ్‍బీర్ కపూర్ (యానిమల్) బెస్ట్ యాక్ట్రెస్: అలియా భట్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: తరుణ్ దూదేజా (ధక్ ధక్) ఉత్తమ డెబ్యూ హీరో: ఆదిత్య రావల్ (ఫరాజ్) బెస్ట్ డెబ్యూ నటి: అలిజే అగ్నిహోత్రి (ఫారీ) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: డేవిడ్ ధావన్ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జోరామ్ (దేవాశిష్ మఖిజా) ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్ ) ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే), షెఫాలీ షా ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ) ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ) ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య ("వాట్ ఝుమ్కా?" - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ) ఉత్తమతారాగణం: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్ ) ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవినాష్ అరుణ్ ధావేర్ (మనం ముగ్గురం) ఉత్తమ VFX: రెడ్ చిల్లీస్ VFX (జవాన్) Also Read: Anchor Sreemukhi : పింక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే View this post on Instagram A post shared by Filmfare (@filmfare) Also Read: SSMB 29: రాజమళి సినిమా కోసం మహేశ్ షాకింగ్ నిర్ణయం.. రెమ్యునరేషన్ రూపాయ్ కూడా వద్దు..! #gujarat #filmfare-awards-2024 #bollywood-filimfare-awards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి