Black magic: ఏపీలో క్షుద్ర పూజలు కలకలం.. నగ్నంగా, స్త్రీ ఆకారంతో బొమ్మలు చేసి! అంబేడ్కర్ కోనసీమ జిల్లా నక్క వారిపేటలోని ఒక ఇంటిలో 20రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నట్లు బయటపడింది. కుండలేశ్వరం శ్మశాన వాటిక వద్ద కోళ్లను బలిచ్చి, నగ్నంగా స్త్రీ ఆకారంతో బొమ్మలు చేసి చేతబడికి పాల్పడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. By srinivas 26 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి AP News: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కుండలేశ్వరం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. నక్క వారిపేటలోని ఒక ఇంటిలో 20రోజుల నుంచి అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఆలస్యంగా బయటపడింది. కత్తులు, ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలో ముగ్గులేసి.. స్త్రీ ఆకారంతో బొమ్మలతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి సమయంలో కారులో ఒక మాంత్రికుడు కొంత మంది యువకులతో వచ్చి పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. Your browser does not support the video tag. ఏజెన్సీ ప్రాంతానికి చెందినవారు రాత్రి వేళలో ఒంటికి పసుపు రాసుకుని దిగంబరంగా పూజలు చేస్తున్నారని చెబుతున్నారు. అర్ధరాత్రి అరుపులు, కేకలతో హడలిపోతున్నామని, సుమారు ఇరవై మంది గుంపుగా క్షుద్రపూజలు చేస్తున్నట్లు వెల్లడించారు. కుండలేశ్వరం శ్మశాన వాటిక వద్ద కోళ్లను బలిచ్చి.. నగ్న పూజలు, మట్టి బొమ్మను చేసి, గోదావరిలో దిగంబర స్నానాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. గ్రామంలో ఎవరిపైనో చేతబడి, బాణామతి వంటి కార్యక్రమాలు చేస్తున్నారని, అటువైపు వెళ్లాలంటేనే భయం భయంతో గడుపుతున్నామని వాపోతున్నారు. అయితే గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పూజలు భగ్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటిలో కత్తులు, ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, స్త్రీ ఆకారంతో బొమ్మలు ఉన్నట్లు నిర్దారించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, త్వరలోనే ఇందుకు బాధ్యులైన వారిని పట్టుకుంటామన్నారు. Your browser does not support the video tag. #ambedkar-konaseema-district #black-magic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి