డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు.... మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు...!

పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆమె అన్నారు. క్యాంపెయిన్ కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను కమల నాథులు బుక్ చేశారని వెల్లడించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సారి దేశం 'నిరంకుశ' పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

author-image
By G Ramu
New Update
Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్‌- బెంగాల్ సిఎం మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆమె అన్నారు. క్యాంపెయిన్ కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను కమల నాథులు బుక్ చేశారని వెల్లడించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సారి దేశం 'నిరంకుశ' పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

రాష్ట్రంలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్లకు 'చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు' చేస్తున్న కొందరు వ్యక్తులే కారణమని ఆమె ఆరోపించారు. కొంత మంది పోలీసు వ్యక్తల సహకారంతోనే ఇది జరిగిందని ఆమె మండిపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలను బీజేపీ నిర్వహిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇతర పార్టీలకు ప్రచారానికి అవకాశం లేకుండా అన్ని హెలికాప్టర్లను ఆ పార్టీ బుక్ చేసిందన్నారు.

దేశంలో వివిధ వర్గాల మధ్య కాషాయ పార్టీ శత్రుత్వాన్ని పెంచిందని పేర్కొన్నారు. అలాంటి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే అది మన దేశాన్ని ద్వేషపూరిత దేశంగా మారుస్తుందని చెప్పారు. బెంగాల్ లో మూడు దశాబ్దాల పాటు పాలన సాగించిన కమ్యూనిస్టులను తాను ఓడించానని పేర్కొన్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కూడా ఓడిస్తామని ఆమె అన్నారు.

జాదవ్ పూర్ వర్సిటీలో ‘గోలీమార్’అని ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారని చెప్పారు. వర్సిటీలో ద్వేషపూరిత నినాదాలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని పేర్కొన్నారు. అలాంటి నినాదాలు చేస్తున్న వారందరూ ఇది బెంగాల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎలా పడితే అలా నినాదాలు చేసేందుకు ఇది యూపీ కాదన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.

New Update
west-bengal-teacher

west-bengal-teacher

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం

ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు.  మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని ..  అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. 

Also Read :  Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

Advertisment
Advertisment
Advertisment