CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి... సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు TG: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే అని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో బీజేపీకి ఓటువేస్తే తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. By V.J Reddy 10 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: మక్తల్ కాంగ్రెస్ జనజాతర సభ, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 ఏళ్లు గడిచినా.. ఈ పాలమూరు జిల్లాకు సాగునీటి కష్టాలు తీరలేదని అన్నారు. మనకళ్లముందు పారే కృష్ణమ్మ మన పొలాలను తడపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కూడా పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించలేదని మండిపడ్డారు. ఢిల్లీ సుల్తానుల కోసం సొంత జిల్లాకే అన్యాయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బంగ్లాల్లో కూర్చుని కుట్రలు చేస్తున్నవారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ALSO READ: సీఎం రేవంత్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు డీకే అరుణ ఓడిపోతే.. పాలమూరుకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు సంస్థలు, పెట్టబడులు పోవటం ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వవేస్తే అలాగే జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటువేస్తే తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. #cm-revanth-reddy #bjp #modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి