Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. By Nikhil 07 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్(KTR), హరీష్ రావు (Harish Rao) చేస్తున్నారన్నారు. ఇంతకన్నా కుటుంబ పాలన కు ఉదాహరణ ఏమి కావాలని ప్రశ్నించారు. బావ బావమరిదులు రాష్ట్రాన్ని సగం సగం పంచుకున్నట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్లో కాన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వంద శాతం లబ్దిదారులకు చేరాయన్నారు. టైం ప్రకారం డెలివరీ చేస్తుంది మోడీ సర్కార్ మాత్రమేన్నారు. మోదీ పథకాలు అమలు, కేసీఆర్ పథకాల అమలు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇది కూడా చదవండి: Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్.. పూర్తి మెజారిటీ బీజేపీ కి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మురళీధర్ రావు. తెలంగాణ ప్రజలను ఎలక్షన్ సర్వే లు అంచనా వేయలేవన్నారు. తెలంగాణ లో యువత బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉందన్నారు. కాంగ్రెస్ నమ్మకం లేని పార్టీ, భరోసా ఇవ్వలేని పార్టీ అధి ధ్వజమెత్తారు. ఆ పార్టీ ది అరువు తెచ్చుకునే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దళారీ వ్యవస్థ నడవాలి అనుకునే వారు లేని కాంగ్రెస్ ను పిక్చర్ లోకి తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే సమావేశం నిన్నటి బీజేపీ కౌన్సిల్ సమావేశం అని అభివర్ణించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లో కొత్త నాయకత్వం, కొత్త ప్రభుత్వం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒక స్మోక్ స్క్రీన్ అంటూ అభివర్ణించారు. కాంగ్రెస్ కు ప్రచారం చేస్తుందే BRS అని అన్నారు. కాంగ్రెస్ ను నడిపిస్తున్న లీడర్ ఫ్రాంచైజ్ పర్సన్ అన్నారు. ట్రైబల్ వర్సిటీ రాష్ట్ర పునర్విభజన చట్టం లో ఉంది.. కేంద్రం ఇచ్చిందన్నారు. టెక్స్ టైల్ పార్క్ లాంటివి కేంద్రం ఇస్తా అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోవడంతో ఆగి పోయాయన్నారు. పసుపు బోర్డ్ గురుంచి మాట్లాడింది మొదట మేమే అని అన్నారు. మోదీ లేకపోతే పసుపు బోర్డ్ వచ్చేదే కాదన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ ఆంధ్ర మధ్య నీటి పంపకం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ కు లాభం జరుగుతుందన్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత్ వందకు పైగా పతకాలు సాధించడం వెనుక మోదీ కృషి ఉందని మురళీధర్ రావు అన్నారు. #bjp #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి