DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చీకటి ఒప్పందం: డీకే అరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తెలంగాణ బండారం బయటపెడితే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారని ఆమె ఫైరయ్యారు. ప్రధానిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.

New Update
DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చీకటి ఒప్పందం: డీకే అరుణ

మోదీ సభలు సక్సెస్ అవ్వడంతో కాంగ్రెస్- బీఅర్ఎస్ నేతలు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కంత్రి రామరావు, హరస్‌మెంట్ హరీష్‌రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిందే కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం అన్నట్టు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర వాఖ్యలు చేశారు. ఎంతో మంది అమాయక యువతను దుబాయ్ పేరుతో దొంగ పాస్ పోర్టులు ఇచ్చి మోసం చేసిన ఘనుడు సీఎం అని డీకే అరుణ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అటువంటి కుటుంబానికి ఇన్ని వేల కోట్లు ఎక్కడివి..? అని ప్రశ్నించారు.

మాట్లాడే అర్హత లేదు

అబద్దం తప్ప.. కేసీఆర్ కుటుంబం నిజం చెప్పాదని ఫైర్‌ అయ్యారు. అటువంటి మీకు మోదీ గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు. ప్రజలకు ప్రధాని వాస్తవాలు చెప్తే ఎందుకంత అక్కసు..? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నిన్ను సీఎం చేసేందుకే కదా.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా మీ నాన్న మార్చారని మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు. మోదీ చెప్పినవి వందకు వంద శాతం నిజమన్నారు. కేసీఆర్ కుటుంబం రాజకీయ నాయకులు అంటేనే అసహించుకునే విధంగా మాట్లాడుతున్నారంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ విషయం కేటీఆర్-కేసీఆర్‌ గమనించాలన్నారు. ఎన్నికల షెడ్యూలుపై ఎర్రబెల్లి మాట్లాడిన ఆడియోను డీకే అరుణ వినిపించారు.

దొంగ పాస్ పోర్టులు ఇచ్చి

షెడ్యూల్ వచ్చే వరకు పథకాలతో ముందుకి దొబ్బాలని ఆడియోలో ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ దగా చేసి.. అమలు కానీ హామీలు ఇచి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కంత్రి కుటుంబం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తకట్టు పెట్టిందని డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ అంటే మీ తాత జాగిరా..? మీరెవరు ప్రధానిని రావద్దని చెప్పడానికి..? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. అన్ని రంగాల వారిని మోసం చేసి లక్షలు కోట్లు సంపాదించారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు దొంగనే దొంగ అనట్లుగా ఉన్నాయని డీకే అరుణ ఫైరయ్యారు. ప్రధానిపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని డీకే అరుణ తెలిపారు. అందితే కాలు.. లేదంటే జుట్టు పట్టుకునే చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనంటూ విమర్శల వర్షం కురిపించారు డీకే అరుణ.

Advertisment
Advertisment
తాజా కథనాలు