/rtv/media/media_files/2025/04/24/cPIfgNqhp9fijFrQOOM2.jpg)
Body of software engineer Madhusudhan
Pahalgam Terror Attack : నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది.దూరప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, సన్నిహితులు భారీ సంఖ్యలో కావలికి తరలి వస్తున్నారు. మధుసూధనరావు ఇక లేరనే వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా కాశ్మీర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు చెన్నైకు తీసుకు వచ్చిన ఆయన పార్థివ దేహన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కావలి తాసిల్దార్ శ్రావణ్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయన భౌతికకాయానికి పలువురు అధికారులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం కావలికి తరలించారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు నివాసముంటున్నారు. మధుసూదన్‌రావు 12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతదేహానికి కావలిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్టణానికి చెందిన ఏపీ తెలుగు సంఘం సభ్యుడు జేఎస్ చంద్రమౌళి కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి
పదిలక్షల ఆర్థికసాయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రమౌళి, మధుసూదన్‌లకు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉన్నాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మచ్చ అని చెప్పారు.పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి లో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు నష్ట పరిహారం ప్రకటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి బుధవారం వైజాగ్ లో నివాళులుఅర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి అనాగరిక చర్యగా పేర్కొన్నారు. కశ్మీర్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుండగా.. ఈ దాడితో అవన్నీ కుంటుపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిచాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు.. సరిహదుల్లో ముష్కరుల చొరబాటును అడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడిలో వైజాగ్ కు చెందిన చంద్రమౌళితోపాటు, కావలికి చెందిన మధు సూదన్ రావులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!
తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది..
కశ్మీర్‌లోని పెహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి ఆయన బుధవారం రాత్రి నివాళులర్పించారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోడియంపై ఉంచిన మృతదేహంపై స్వయంగా జాతీయ పతాకాన్ని కప్పారు. చంద్రమౌళి తోడల్లుడు కుమార్‌రాజా, బావమరిది బీఎస్ నాగేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి, కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అంతిమయాత్ర వాహనం ముందు నడుస్తూ నిర్వహించిన శాంతి ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులను దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
Purandeswari: పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ!
ఏపీలో పొత్తులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. బీజేపీ రాష్ట్ర పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. త్వరలో ఏ పార్టీతో పొత్తు అనేది చెబుతామని అన్నారు.
Daggubati Purandeswari: త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. బీజేపీ అధిష్టానం రాష్ట్ర పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ముగ్గురు నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారని అన్నారు.
ALSO READ: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు
కన్ఫ్యూజన్ లేదు...
ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టాం.. పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని అన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసమే కార్యకర్తలు పని చేస్తున్నారని గుర్తు చేశారు.
అప్పుడు స్కామ్ లు.. ఇప్పుడు స్కీమ్ లు.
బీజేపీ కార్యాలయంలో దీన్‌దయాళ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్‌దయాళ్ బీజేపీ మొదటి సిద్ధాంతకర్త అని అన్నారు. చిన్న పరిశ్రమలు నెలకొల్పాలని దీన్‌దయాళ్ భావించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. 2014కు ముందు దేశంలో స్కామ్‌ల వార్తలు విన్నాం అని... మోడీ పాలనలో స్కీమ్‌ల వార్తలు వింటున్నాం అని అన్నారు. కేంద్రంలో అధికారం లోకి వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి
DO WATCH:
Pahalgam Terror Attack: కావలి చేరుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం
పెహల్గామ్ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతిలో నెల్లూరు జిల్లా కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్
మాజీ మంత్రి విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు
BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!
తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. Shorts for app | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Ind-Pak: భారత్ ప్రభుత్వ నిర్ణయాలతో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ
Lemon: నిమ్మకాయను ముఖంపై రుద్దడం మంచిదేనా?
BIG BREAKING: టీమిండియా హెడ్ కోచ్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు
Pahalgam Terror Attack: కావలి చేరుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం
Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్