Bitter Gourd Beauty: కాకరకాయతో చర్మ సౌందర్యం..ఇలా వాడండి ముఖంపై మొటిమలను, మచ్చలకు కాకరకాయ జ్యూస్ బాగా పని చేస్తుంది. కాకరకాయ ముక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి దానిలో జాజికాయ పొడి, పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం అందంగా మారుతుంది. By Vijaya Nimma 11 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bitter Gourd Beauty: కాకరకాయ అంటే చెదుగా ఉంటుందని చాలామందికి ఇష్టం ఉండదు. మనం తీసుకునే ఆహారం కూరగాయల్లో కాకరకాయలు ఒకటి. కాకరకాయలతో రకరకాల కూరలను, వేపుళ్లు వంటి కూరకులు వండుకోని తింటారు. కాకరకాయతో చేసిన కూరలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకరకాయలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. అయితే.. కాకరకాయను తింటే శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంది. మనలో చాలామంది చర్మ ఆరోగ్యానికి కాకరకాయ ఎలా మేలు చేస్తుందని డౌట్ ఉంటుంది. కానీ..ప్రతీరోజూ కాకరకాయను తింటే వివిధ రకాల చర్మ సమస్యలు దూరం అవుతాయి. కాకరకాయ తినటం వలన కలిగే సౌందర్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్‌తో చర్మ సౌందర్యం ముఖంపై మొటిమలను, మచ్చలకు కాకరకాయ జ్యూస్‌బాగా పనిచేస్తుంది. వీటిని తగ్గించి ముఖాన్ని అందంగా మార్చడంలో కాకరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. మొటిమల సమస్యతో బాధపడే వారికి కాకరకాయ మంచి ఫలితం ఇస్తుంది. ఒక గిన్నెలో మన ముఖానికి తగినంత కాకరకాయ జ్యూస్‌ను తీసుకోని అందులో కరివేపాకు పొడి వేసి కలిపి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టుకోని ఆరిన తరువాత గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూంటే మొటిమల సమస్య తగ్గి ముఖంపై ఉండే నల్లటి మచ్చలను తగ్గుతాయి. ఇలా రోజూ చేస్తే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇది కూడా చదవండి: ఈ చిట్కాలతో పాదాలు తెల్లగా మెరవాల్సిందే..మురికి మొత్తం మాయం కాకరకాయను ఉపయోగించడం వల్ల చక్కటి చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే.. కాకరకాయతో ఫేస్ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ఓ జార్‌లో చిన్న కాకరకాయ ముక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పేస్ట్‌లో జాజికాయ పొడి, పెరుగు కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం అందంగా ఉండటంతోపాటు మొటిమలు, మచ్చల సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా కాకరకాయతో చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. #beauty-tips #bitter-gourd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి