Big breaking: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు చేప్పింది. బిల్కిస్ బానో కేసులో 11మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసింది. ఖైదీల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టేసింది సుప్రీంకోర్టు. By Manogna alamuru 08 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bilkis bano case:న్యాయానికి కట్టుబడి ఉంటామని మరోసారి రుజువు చేసింది ఉన్నతన్యాయస్థానం. బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టే అధికారం లేదని తీర్పు చెప్పింది. గుజరాత్ ప్రభుత్వానిది అధికార దర్వినియోగం అని చివాట్లు పెట్టింది. ఒకవేళ అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత ఉన్నా అది మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్ట చేసింది. ఎందుకంటే బిల్కిస్ బానో కేసు విచారణ మొత్తం మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తు చేసింది. మరోవైపు బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని తేల్చి చెప్పింది. Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government Read @ANI Story | https://t.co/4K2Lx1nqbE#BilkisBanocase #SupremeCourt #GujaratGovernment pic.twitter.com/bahrsYnBOs — ANI Digital (@ani_digital) January 8, 2024 ఏంటీ బిల్కిస్ బానో కేసు.. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం... గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీని పట్ల అప్పట్లో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. అనంతరం బాధితులు దోషుల విడుదలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు సీపీఐ (ఎం) నేత సుభాషిణి అలీ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రేవతిలాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ రూప్ రేఖావర్మ, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ధర్మాసనం వ్యాఖ్యలు... దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. గతేడాది అక్టోబర్ 12న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం..ఇవాళ తీర్పు వెలువరించింది. 11మంది దోషులకు క్షమా భిక్ష రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దోషులు మోసపూరిత మార్గాల ద్వారా ఆర్డర్స్ పొందారని... 2022 ఆర్డర్స్ మీద గుజరాత్ ప్రభుత్వం సమీక్ష కోరవలసి ఉందని ఉన్నతన్యాస్థానం న్యాయమూర్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం వాడుకలో లేని 1992 చట్టాన్ని ఉపయోగించి దోషులను విడుదల చేసిందని జడ్జిలు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు మళ్ళీ దోషులు తిరిగి జైలుకు వెళ్లి రెండు వారాల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. #supreme-court #case #bilkis-bano #gujarath-roits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి