Bihar VS DMK: 'మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..' డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం!

బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చినవారు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటారన్న డీఎంకే ఎంపీ దయానిది మారన్‌కు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ కౌంటర్ ఇచ్చారు.తమ కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం మానేస్తే రాష్ట్రాలు స్తంభించిపోతాయని చెప్పారు.

New Update
Bihar VS DMK: 'మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..' డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం!

డిగ్నిటీ ఆఫ్‌ లెబర్‌ అన్నది అన్నిటికంటే ముఖ్యం. ఇది చాలా మందికి తెలియదు. ఇక ఒక మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని జనరలైజ్‌ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజకీయ నేతల వరకు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తరతరాలుగా అందరూ చూస్తున్నదే. అందిరికి ఆదర్శంగా ఉంటూ.. సక్రమ మార్గంలో నడుస్తూ.. ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడుతూ నలుగురి మధ్య తిరగాల్సిన రాజకీయ నాయకులు ఏనాడో లిమిట్‌ దాటిపోయారు. మొన్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(Nitish Kumar) తన హిందీ దురహంకారాన్ని బయటపెట్టుకుంటే నిన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌(Dayanidhi Masan) బీహార్‌, యూపీ సమాజంపై నోరుపారేసుకున్నాడు. బీహార్‌, యూపీ ప్రజలు మరుగుదొడ్లను శుభ్రం చేస్తారంటూ దయానిధి మారన్‌ చేసిన కామెంట్స్‌పై బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌(Tejeshwi Yadav) గట్టిగానే ఇచ్చిపడేశారు.

మేం లేకపోతే స్థంభించిపోతారు:
యూపీ, బీహార్ ప్రజల గురించి నాయకుడెవరైనా సరే నోరుపారేసుకుంటే దాన్ని కచ్చితంగా ఖండిస్తామని తేజస్వీ యాదవ్‌ చెప్పారు. INDIAకూటమీలో డీఎంకే, JDU రెండూ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ రాష్ట్ర ప్రజల గురించి దయానిధి మారన్‌ చేసిన వ్యాఖ్యలను తాము అంగీకరించడం లేదన్నారు తేజస్వీ. యూపీ, బీహార్‌లకు చెందిన కూలీలకు దేశమంతటా డిమాండ్ ఉన్నదని.. వారు వేరే ప్రాంతాలకు వెళ్లడం మానేస్తే.. రాష్ట్రాలు పనిచేయడం మానేసి, స్తంభించిపోతాయని తేజస్వి యాదవ్ ధీటుగా బదులిచ్చారు.

బీహార్, యూపీ ప్రజలు కాలువలు శుభ్రం చేసేందుకు వస్తున్నారని మారన్‌ చెప్పడాన్ని తేజస్వీ యాదవ్‌ ఖండించారు. అన్ని పార్టీల నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిజానికి మారన్‌చేసిన వ్యాఖ్య రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. పాట్నా సాహిబ్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ ఎంపీ మారన్‌ వ్యాఖ్యల వీడియోలను షేర్ చేశారు. డీఎంకే నాయకులు బీహార్ ప్రజలను అవమానించడం మానేయాలని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు. డీఎంకేతో కలిసి INDIAకూటమీలో ఉన్న JDU దీనిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Also Read: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు