BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి బిగ్ షాక్.. ఆయన మాల్ స్వాధీనం!

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి బిగ్ షాక్.. ఆయన మాల్ స్వాధీనం!

Armoor Ex MLA : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) కి ఆర్టీసీ అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. ఆర్మూర్‌ బస్ స్టేషన్‌ సమీపంలో జీవన్ రెడ్డి మాల్‌ అండ్ మల్టీప్లెక్స్(Jeevan Reddy Mall & Multiplex) భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని 2013లో ఆర్టీసీ సంస్థ నుంచి విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ 33 సంవత్సరాల లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా కంపెనీని జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేకోవర్ చేసుకుంది. షాపింగ్‌మాల్‌కు జీవన్ రెడ్డి మాల్ అండ్‌ మల్టీప్లెక్స్‌గా పేరు మార్పు చేశారు. అయితే.. ఒప్పందం ప్రకారం సకాలంలో అద్దె చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

గతేడాది అక్టోబర్ నాటికి రూ. 8.65 కోట్ల బకాయి ఉందని వారు అంటున్నారు. నోటీసులు ఇవ్వడంతో అదే నెలలో రూ.1.50 కోట్లు చెల్లించారని చెబుతున్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో డిసెంబర్‌ విడతల వారీగా మరో రూ.2.40 కోట్లు చెల్లించారని ఆర్టీసీ(RTC) చెబుతోంది. ఈ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జీవన్ రెడ్డి. బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య

జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రూ.2 కోట్లు చెల్లించారు. నెల రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లించాలని మార్చి 27న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల గడువు పూర్తయినా బకాయిలను జీవన్ రెడ్డి చెల్లించలేదు. దీంతో రూ.2.51 కోట్ల అద్దె పెండింగ్ లో ఉంది. బకాయిల కోసం గత ఐదేళ్లుగా 20కి పైగా నోటీసులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు టర్మినేషన్ ఆర్డర్‌ జారీ చేసిన ఆర్టీసీ.. తాజాగా బిల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

హరీష్ రావు తండ్రికి అనారోగ్యం.. AIG ఆస్పత్రిలో చేరిక!

బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఈ రోజు సత్యనారాయణ రావును పరామర్శించారు.

New Update
BRS MLA Harish Rao

BRS MLA Harish Rao

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

బీఆర్ఎస్ నేతల పరామర్శ..

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి సత్యనాయణరావును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఉన్నారు.

(BRS Harish Rao | telugu-news | telugu breaking news )

Advertisment
Advertisment
Advertisment