Yediyurappa : పోక్సో కేసులో యడియూరప్పకు భారీ ఊరట

పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై రెండువారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. విచారణ చేయవచ్చనీ, అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

New Update
Yediyurappa : పోక్సో కేసులో యడియూరప్పకు భారీ ఊరట

Karnataka Ex. CM Yediyurappa : కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (Yediyurappa) కు ఉపశమనం లభించింది. రెండువారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు (High Court) ఏకసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. యడియూరప్పకు వయసు పైబడిందనీ, సహజంగానే ఆరోగ్య సమస్యలు ఉంటాయనీ, అరెస్టు చేసి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసుపై ఆయన్ని విచారణ చేయవచ్చనీ, కానీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యడియూరప్పకు ఉపశమనం లభించడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా పోక్సో కేసు (POCSO Case) లో యడియూరప్పకు నాన్‌ బెయిలబుల్‌ పోలీసులు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : ఛత్తీస్ ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులకు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు