BIG BREAKING: తెలంగాణ ప్రజా కవి జయరాజ్‌కు గుండెపోటు ప్రముఖ తెలంగాణ ప్రజా కవి జయరాజుకు ఈ రోజు ఉదయం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ కు తరలించారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. By Nikhil 20 Jul 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా కవి, గాయకుడు జయరాజు ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకల్లో జయరాజు కనిపించారు. ఇంతలోనే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. ప్రస్తుతం జయరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మనూర్ లో జన్మించిన జయరాజ్.. వివక్షకు, వెట్టిచాకిరికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈక్రమంలో తన ఆట పాటలతో ప్రజా కళాకారుడిగా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్నాళ్లు గద్దర్ తో కలిసి సంస్కృతిక పోరాటం చేశారు. కేవలం ఉద్యమ పాటలే కాకుండా.. ప్రకృతి, మానవ సంబంధాలపై సైతం ఆయన రాసిన పాటలు విస్తృత ప్రజాధారణ పొందాయి. ఈ నెల 14 తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జయరాజు 2000 సమయంలో నాటి కరువు పరిస్థితులను నేపథ్యంలో ఆయన రాసిన 'వానమ్మ.. వానమ్మా..' పాట ప్రతీ ఒక్కరిని కదిలించింది. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2023లో ఆయనకు కాళోజీ నారాయణరావు అవార్డును అందించి సత్కరించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి