AP News : ఏపీ ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్‌ దందా!

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ గెలవబోతున్నారనే అంశంపై జోరుగా బెట్టింగ్‌ దందా నడుస్తోంది. వైసీపీ, కూటమిలతోపాటు కీలక నేతలపై ఒకటికి నాలుగు రేట్లు పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వైసీపీ.. జగన్ ప్రమాణ స్వీకారం తేదీ అనౌన్స్ చేయడం విశేషం.

New Update
AP News : ఏపీ ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్‌ దందా!

AP Elections Betting : ఏపీ ఎన్నికల ఫలితాలపై (Exit Polls) ఉత్కంఠ పెరుగుతుంది. వైసీపీ (YCP), టీడీపీ కూటమిలు (TDP Alliance) రెండూ గెలుపు మీద విశ్వాసంతోనే ఉన్నాయి. వైసీపీ మరోక అడుగు ముందుకేసి జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ తొమ్మిదో తారీఖున ప్రమాణస్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎవరూ గెలవబోతున్నారనే అంశంపై జోరుగా బెట్టింగ్‌ దందా నడుస్తోంది. అభ్యర్థుల గెలుపుతో పాటు కీలక నేతల మెజార్టీలపైనా పందెం కాస్తున్నారు. వైసీపీకి 69-72 ఎమ్మెల్యే, 7-8 ఎంపీ స్థానాలు పక్కా, కూటమి 104 నుంచి 107 అసెంబ్లీ, 16-18 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంటుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.

ఒకటికి నాలుగు రెట్లు..
ఇక కీలక నేతలు జగన్‌, చంద్రబాబు (Chandrababu), పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), లోకేష్‌ (Nara Lokesh) కు వచ్చే మెజార్టీలపైనా భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. పులివెందులలో జగన్‌కు 60 వేల నుంచి 67 వేల మధ్య మెజార్టీ వస్తుందని ఒకటికి ఒకటిన్నర, కుప్పంలో చంద్రబాబుకు 32 వేల 37 వేల మధ్య మెజార్టీ వస్తుందని ఒకటికి రెండు రెట్లు పందెం కాస్తున్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌కు 40 వేల నుంచి 47 వేల మధ్య మెజార్టీ వస్తుందంటూ ఒకటికి రెండు రెట్లు, మంగళగిరిలో లోకేష్‌కు 36 వేల 42 వేల మధ్య మెజార్టీ వస్తుందని ఒకటికి ఒకటిన్నర, గన్నవరంలో వంశీ గెలుపు మీద ఒకటికి రెండున్నర, గుడివాడలో నాని గెలుపు మీద ఒకటికి రెండున్నర బెట్టింగ్ పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Jawaharlal Nehru: ప్రధాని నెహ్రూకు పూలమాల.. 15 ఏళ్ల బాలికను ఆ ఊరు ఏం చేసిందంటే!

భీమవరంలో వైసీపీ గెలుపు మీద ఒకటికి 4 రెట్లు, ఉండిలో వైసీపీ గెలుపు మీద ఒకటికి రెండు, చీపురుపల్లిలో బొత్స గెలుపు మీద ఒకటికి రెండు రెట్లు, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద రావు విజయంపై ఒకటికి నాలుగు రెట్లు బెట్టింగా కాస్తున్నారు. పలాసలో గౌతు శిరీష గెలుపు మీద ఒకటికి 3 రెట్లు, భీమిలిలో గంటా శ్రీనివాస రావు గెలుపు మీద ఒకటికి రెండు రెట్లు, తునిలో దాడిశెట్టి రాజా గెలుపు మీద ఒకటికి రెండు రెట్లు, రాజానగరంలో జనసేన గెలుపు మీద ఒకటికి ఒకటిన్నర బెట్టింగ్, తణుకులో వైసీపీ అభ్యర్థి గెలుపు మీద ఒకటికి మూడు రెట్లు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గెలుపు మీద ఒకటికి ఒకటిన్నర పందెం పెడుతున్నారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి గెలుపు మీద ఒకటికి ఒకటికి రెండు, మార్కాపురంలో అన్నా రాంబాబు గెలుపు మీద ఒకటికి రెండున్నర, ఒంగోలులో దామచర్ల గెలుపు మీద ఒకటికి రెండు, నగరిలో రోజా గెలుపు మీద ఒకటికి రెండున్నర, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి గెలుపు మీద ఒకటికి ఒకటిన్నర బెట్టింగ్‌ కాస్తున్నారు పందెం రాయుళ్లు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap News: ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం..

ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.

New Update
fishing

fishing

ఏపీలో గత అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటూ చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి వాటి సంతాన్నాన్ని అభివృద్ది చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు.

Also Read:ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!

ఈ రెండు నెలల పాటూ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు కూడా దూరం అవుతారు. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. 

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

గతంలో చేపల వేట నిషేధం 40 రోజులు ఉంటే.. దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. ఆ తర్వాత ఆ స్థానంలో మత్స్యకార భరోసా వచ్చింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున సాయం అందించింది.. దానిని రూ.4 వేలుకు పెంచారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.

అందుకు తగిన విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.. ఈ నెల కానీ, మే నెలల ో కానీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు అధికారులు.

Also  Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

fishing-boat | fishing | 2 months | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment