బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు!

బైడెన్ బీచ్‌ లో బేర్ బాడీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అందుకే వాటిని చూసిన వారందరూ వావ్‌ అంటున్నారు. 80 ఏళ్ల వయసులో షర్టు లేకుండా బేస్‌ బాల్‌ క్యాప్ పెట్టుకుని, కళ్లజోడు ధరించి హాలీవుడ్‌ యాక్షన్‌ హీరోలా ఫోజులిస్తున్నారు

New Update
బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆయన చర్యల వల్ల వార్తల్లో నిలిచారు. కొన్ని సార్లు ఆయన మతిమరుపు వచ్చి పేర్లు మార్చేసి పలకడం, కాలు జారి కిందపడటం వంటి వల్ల ఆయన చాలా సార్లు ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు.

అలాంటివి అన్ని కూడా నెట్టింట వైరల్‌ కూడా అవుతుంటాయి. తాజాగా ఆయన బీచ్‌ లో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. మాములుగా అయితే అంతగా షికారు చేసేవి కాదేమో..బైడెన్ బీచ్‌ లో బేర్ బాడీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

అందుకే వాటిని చూసిన వారందరూ వావ్‌ అంటున్నారు. 80 ఏళ్ల వయసులో షర్టు లేకుండా బేస్‌ బాల్‌ క్యాప్ పెట్టుకుని, కళ్లజోడు ధరించి హాలీవుడ్‌ యాక్షన్‌ హీరోలా ఫోజులిస్తున్నారు బైడెన్‌. ప్రస్తుతం బైడెన్‌ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఇలాగే షర్ట్ లేకుండా గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన కండలు తిరిగిన బాడీని చూపించారు. దానికి ఏ మాత్రం తగ్గకుండా బైడెన్ ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

అమెరికా పెద్దన్న ఫోటోలా మజాకానా అంటూ సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ లెక్క బైడెన్ పోజుల్లో భలే గమ్మత్తుగా ఉన్నారు. డెలావేర్ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌ లో బైడన్ సరదాగా కాసేపు ఎంజాయ్ చేశారు.

ఆయన షర్టు లేకుండా ఓన్లీ షార్ట్‌ తో ఉన్న ఫోటోను అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ తీసి దానిని తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు..రెహుబోత్ బీచ్ లో ప్రెసిడెంట్ అద్భుతమైన బీచ్ డేను ఎంజాయ్‌ చేస్తున్నారని ఫోటోకు క్యాప్షన్ పెట్టారు.

అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కూడా ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా బైడెన్ ఫోటోలున్నాయి. గతంలో హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలిన్ బాడీకి తన తలను జోడించిన కొన్ని చిత్రాలను గతంలో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు