Trump-Biden: ట్రంప్ పై దాడిని ఖండించిన బైడెన్! ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన గురించి భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు. By Bhavana 14 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Trump-Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ వేదిక ప్రసంగిస్తుండగా..దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్లు నిఘా వర్గాలు వివరించాయి. ఈ క్రమంలోనే కాల్పులకు తెగబడ్డ దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. కాల్పులు జరిపిన తరువాత ట్రంప్ స్టేజి పై నుంచి కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. వెంటనే ట్రంప్ ని వేదిక మీద నుంచి కిందకి దింపి సురక్షితంగా తీసుకుని వెళ్లినట్లు భద్రతాధికారులు తెలిపారు. ఖండించిన బైడెన్! ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన గురించి భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు. I have been briefed on the shooting at Donald Trump’s rally in Pennsylvania. I’m grateful to hear that he’s safe and doing well. I’m praying for him and his family and for all those who were at the rally, as we await further information. Jill and I are grateful to the Secret… — President Biden (@POTUS) July 13, 2024 Also Read: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు.. ! #donald-trump #joe-biden మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి