Bhuma Family: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి ఆళ్లగడ్డ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి పోటీగా భూమా కిషోర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జిగా ఉన్నా కిశోర్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోని అఖిలప్రియాకు చెక్ పెట్టాలని ఎత్తుగడలు వేస్తోంది. By Jyoshna Sappogula 02 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Bhuma Kishore Reddy : నంద్యాల జిల్లా(Nandyal District) లో ఆళ్లగడ్డ రాజకీయం(Allagadda Politics) ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీ టీడీపీ(YCP-TDP) ని ఓడించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) కు టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెని ఓడించాలని వైసీపీ పెద్ద స్కెచ్ గీస్తోంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీలో రాజకీయ వారసత్వం కోసం కలహాలు ఉండటంతో వాటిని క్యాష్ చేసుకుని మరోసారి ఆళ్ళగడ్డలో వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అఖిల ప్రియ సొంతం పెదనాన్న కుమారుడు, ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ(BJP) ఇన్‌ఛార్జిగా ఉన్నా భూమా కిశోర్‌రెడ్డి(Bhuma Kishore Reddy) ని తమ పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పొత్తు ఉంటే బీజేపీ సీటు తనదేనని కిశోర్ ధీమా వ్యక్తం చేసేవారు. అయితే, టీడీపీ అఖిలప్రియకు టికెట్ ఇవ్వడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అఖిల పేరు ప్రకటనతో కిశోర్‌రెడ్డి పునరాలోచనలో పడ్డారు. వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read : కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్ చేసే చిట్కాలు! నంద్యాల ఎంపీ పొచ బ్రహ్మాంనందరెడ్డితో కిషోర్‌రెడ్డి ఇంట్లో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కిశోర్ ప్రతిపాదించారట.. కానీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి ఇస్తామని వైసీపీ అంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అఖిల ప్రియను తీవ్రంగా వ్యతిరేకించే కిషోర్ రెడ్డి ద్వారా టీడీపీ(TDP) కి చెక్ పెట్టాలని అధికార పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో అఖిల ప్రియ మీద 35 వేల ఓట్ల భారీ మెజారిటీతో బ్రిజేంద్ర గెలుపొందారు. దాంతో మరోసారి అంతటి మెజారిటీని దక్కించుకోవడానికి వైసీపీ భూమా కిషోర్ రెడ్డిని కోరి మరి పార్టీలోకి ఆహ్వానిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కిశోర్‌రెడ్డి వైసీపీలో చేరితే అఖిలప్రియకు ఆళ్ళగడ్డ గెలుపు సవాల్ గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన ప్రత్యర్ధులు కలిస్తే ఓటమి కాదు భారీ తేడాతో పరాజయం తప్పదని టీడీపీలో కలవరం మొదలైంది. #ycp #tdp #bhuma-akhila-priya #bhuma-kishore-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి