TDP Bhuma Akhila Priya: ‘రా.. కదలిరా..’ సభకు రావొద్దు.. ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియ కండీషన్.! రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా.. కదలిరా..’ బహిరంగ సభ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే, చంద్రబాబు సభపై టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రేపటి సభకు ఏవి సుబ్బారెడ్డి రావొద్దని భూమా అఖిలప్రియ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 08 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి TDP Bhuma Akhila Priya: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రా కదలిరా పేరిట టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కనిగిరిలో 'రా కదలిరా' సభ నిర్వహించారు. అధికార పార్టీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా.. కదలిరా..’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. Also Read: అయ్యన్నకు బిగ్ షాక్.. తమ్ముడిని బరిలోకి దింపుతున్న వైసీపీ..? బయటపడ్డ వర్గ విభేదాలు.. రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. నియోజకవర్గంలోని నేతలందరూ అప్రమత్తం అయ్యారు. అయితే,ఈ సభ సందర్భంగా టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ‘రా.. కదలిరా..’ సభకు రావొద్దు.. రేపు జరగబోయే ‘రా.. కదలిరా..’ సభకు దూరంగా ఉండాలని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆళ్లగడ్డలో రేపటి చంద్రబాబు సభకు ఏవి సుబ్బారెడ్డిని రావొద్దని.. భూమా అఖిలప్రియ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన సభకు హాజరు అవుతే మళ్లీ ఏమైనా గొడవులు జరుగుతాయని..అందుకే ఏవీ సుబ్బారెడ్డి సభకు రావడం లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అటు జనసేన నేతలకు కూడా అహ్వానం అందినట్లు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. విభేదాలకు కారణం ఇదే.. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులు బతికి ఉన్నంతకాలం వారికి నమ్మిన బంటులా ఉన్నారు ఏవీ సుబ్బారెడ్డి..అయితే, ప్రస్తుతం ఇప్పుడు వారి ఫ్యామిలీకి ప్రధాన రాజకీయ శత్రువుగా మారిపోయారు. భూమా దంపతుల మరణం తర్వాత వారి పిల్లలతో ఏవీ సుబ్బారెడ్డికి విభేదాలు వచ్చాయి. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు కొన్ని ఆస్తుల్ని ఏవీ సుబ్బారెడ్డి పేరుపై ఉంచారని.. కానీ, అతను తిరిగి వాటిని అప్పగించ లేదని ప్రధాన ఆరోపణ. రిసెంట్ గా నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు హింసాత్మక ఘటనకి దారితీసిన విషయం తెలిసిందే. #andhra-pradesh #bhuma-akhila-priya #av-subba-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి