Missing Case: నెల రోజులు తిండిపెట్టకుండా 5 రాష్ట్రాలు తిప్పాడు.. బాలిక మిస్సింగ్ కేసులో సంచలన నిజాలివే!

భీమవరానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజద్ తనకు నెల రోజులు తిండిపెట్టలేదని, 9 నెలలుగా 5 రాష్ట్రాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
Missing Case: నెల రోజులు తిండిపెట్టకుండా 5 రాష్ట్రాలు తిప్పాడు.. బాలిక మిస్సింగ్ కేసులో సంచలన నిజాలివే!

Bhimavaram: ఏపీలోని భీమవరానికి చెందిన బాలిక మిస్పింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల క్రితం అదృష్యమైన యువతి కేసులో పవన్ చొరవ చూపించగా వేగం పెంచిన పోలీసులు.. ఇన్‌స్టా చాట్‌ ఆధారంగా ఆ జంటను జమ్ములో గుర్తించి రాష్ట్రానికి తీసుకోచ్చారు. జమ్ము నుంచి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి, విజయవాడ రామవరప్పాడుకు చెందిన అంజద్‌ను మాచవరం పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి సమాచారం రాబట్టగా.. నెల రోజులుగా సరిగా తిండి పెట్టలేదని, 9 నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ 5 రాష్ట్రాలు తిప్పినట్లు బాధితురాలు తెలిపింది.

కేరళ టూ జమ్మూ ప్రయాణం..
గతేడాది అక్టోబర్‌ 28న రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన జంట.. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అక్కడికి పోలీసులు చేరుకునేసరికి తప్పించుకున్నారని, ఆ తర్వాత ఓ షాపులో 18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేసి కేరళకు వెళ్లినట్లు వెల్లడించారు. కొద్ది రోజులకు కేరళ నుంచి మళ్లీ హైదరాబాద్‌ వచ్చిన జంట.. 15వేలకు చెవిదిద్దులు అమ్మి రాజస్థాన్‌, ముంబై, పుణే, ఢిల్లీల మీదుగా తిరుగుతూ ప్రయాణం కొనసాగించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ జమ్ముకు వెళ్లారు. కొన్నాళ్లకు చేతిలో డబ్బులు లేక కష్టాలపాలయ్యారు. దీంతో తిరిగి తిరిగి ఓ హోటల్‌లో పనికి చేరాడు అంజాద్‌. అయితే వీరిద్దరూ ఫోన్లు అమ్మడంతోపాటు కొత్త నంబర్లు తెలియకపోవడంతో కేసు కష్టంగా మారినట్లు పోలుసులు వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ ఆధారంగా..
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఆదేశాలతో కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన అధికారులు.. IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లు అమ్మేసిన షాపుకు వెళ్లి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్‌, కుటుంబసభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కేసు ఛేదించారు. ఇటీవల అతని ఫోన్‌ నుంచి అక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో తేజస్విని మెసేజ్‌ చేసిందని, ఇన్‌స్టా చాట్‌ ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నంలో వారు ఎక్కడున్నది ఆమె చెప్పలేకపోవడంతో లొకేషన్‌ పంపించిందని పోలీసులు చెప్పారు. అది కూడా ఫెయిలవడంతో ఓ ఫొటో ప్రేమ్‌ పార్శిల్‌ బాక్స్‌పై అడ్రస్‌తో జమ్ములో ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నామని వెల్లడించారు.

ఇక 9 నెలల క్రితం తమ కుమార్తె కనిపించడం లేదని పవన్ కళ్యాన్ కు తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పటికప్పుడే సీఐతో ఫోన్లో మాట్లాడిన పవన్ వెంటనే కేసునే ఛేదించాలని ఆదేశించడంతో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి పట్టకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు