/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-16T181943.787-jpg.webp)
Ganja Smuggling: అందంగా అలంకరించిన వాహనం, రెండువైపులా దేవుడి ఫొటోలు, లోపల ప్రతిష్ఠించి ఉన్న అమ్మవారి విగ్రహం, వాహనంలో కాషాయం కట్టుకుని నిష్టగా పూజలు చేస్తూ భక్తులు... ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? చేతులెత్తి దండం పెట్టాలనే కదా అనిపిస్తుంది. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని పోలీసులు, నిఘా విభాగాల కళ్లు గప్పాలనుకున్నారు కొందరు కేటుగాళ్లు. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకూ విషయమేమిటంటే...
జల్సాలకు అలవాటుపడ్డ కొందరు యువకులు డబ్బుల కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇందుకోసం వారు వేసిన ప్లాన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. వాహనాన్ని దేవుడి రథంలా అలంకరించరు. ఒక వైపు శిరిడీ సాయిబాబా, మరో హనుమంతుని చిత్రాలను పెట్టారు. లోపల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా భక్తుల్లా బిల్డప్ ఇస్తూ ఏకంగా రూ. 1.20 కోట్ల విలువచేసే 484 కేజీల గంజాయిని తరలించేందుకు స్కెచ్ వేశారు. అలా గంజాయిని తరలిస్తుండగా భద్రాచలం పోలీసులు వారిని పట్టుకున్నారు. వారు గంజాయిని తరలిస్తున్న తీరు చూసి పోలీసులే షాకయ్యారు.
TSNAB apprehended (03)persons seized 484 kgs of Ganja and (01) vechile at khammam PS limits,TS .Total worth of Rs 1.22 Cr.@TelanganaDGP @narcoticsbureau @revanth_anumula @CVAnandIPS @hydcitypolice @TelanganaCMO@TelanganaCOPs @RachakondaCop @cyberabadpolice#drugfreetelangana pic.twitter.com/NoIevnYFae
— Telangana Anti Narcotics Bureau (@TS_NAB) December 14, 2023
హర్యానాకు చెందిన మున్షిరాం, బగత, గోవింద్ తక్కువ సమయంలో పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించేందుకు గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. ఒక ఆటో కొని దేవుడి ప్రచార రథంలా రూపొందించారు. భక్తుల వేషం ధరిస్తే ప్రజలకు, పోలీసులకు అనుమానం రాదని భావించి ఈ ప్లాన్ వేశారు. ఒరిస్సా సరిహద్దుల్లోని కలిమెల పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయించేందుకు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో భద్రాచలం చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు దొరికిపోయారు. వారి నుంచి 484 కిలోల గంజాయి, ఒక ఆటో, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 1.21కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.