Ants Best Tips: ఇంట్లో చీమలను తరిమేసే చక్కటి చిట్కాలు

ఇంట్లో ఏదైనా ఆహారం వండినప్పుడు వెంటనే దానికి చీమలు పడుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చీమల బెడద మాత్రం వదలదు. చీమ‌లు ఎక్కువగా ఉన్న దగ్గర దాల్చిన చెక్క పొడిని నీటితో క‌లిపి స్ప్రే చేయ‌డంతో చీమలు పారిపోతాయి.

New Update
Ants Best Tips: ఇంట్లో చీమలను తరిమేసే చక్కటి చిట్కాలు

Ants Best Tips: సాధారణంగా ఇంట్లో ఏదైనా ఆహారం వండినప్పుడు వెంటనే దానికి చీమలు (ants) పడుతుంటాయి. తీపి పదార్థాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ చీమలు తిరుగుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆహారపదార్థాలను నాశనం చేసి మనల్ని కుడుతూ టార్చర్‌ చూపిస్తుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చీమల బెడద మాత్రం వదలదు. అయితే ఇంట్లో (home) దొరికే సహజసిద్ధమైన వాటిని ఉపయోగించి చీమలను ఇంట్లోకి రానివ్వకుండా చేయొచ్చు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: గడ్డితో తలనొప్పి మాయం..ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం
చీమ‌లు ఎక్కువగా ఉన్న దగ్గర దాల్చిన చెక్క పొడిని నీటితో క‌లిపి స్ప్రే చేయ‌డంతో చీమలు పారిపోతాయి. అంతేకాకుండా నిమ్మకాయ రసంలో ఉప్పు లేదా వైట్‌ వెనిగర్‌ వేసి చీమలు తిరిగే దగ్గర స్ర్రే చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇక వేడి నీళ్లలో ఉప్పు (salt) వేసి అందులో ఒక బట్టను ముంచి చీమలు (ants) వచ్చిన దగ్గర రాయడంతో కూడా చీమలు రాకుండా ఉంటాయి. అలాగే పుదీనా ఆకుల పౌడర్‌ను నీళ్లలో వేసి చీమ‌లు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేస్తే చీమల బారి నుంచి బయటపడవచ్చు. వైట్ వెనిగ‌ర్‌ నీళ్లలో కలిపి చీమలు ఉన్న దగ్గర చల్లవచ్చు.
ఇలా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు
కాఫీ పౌడర్‌ లేదా మిరియాల పొడి నీళ్లలో కలిపి ఆ ప్రాంతంలో చల్లినా చీమలు రాకుండా ఉంటాయి. చీమలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో నిమ్మ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలను పెడితే చీమ‌లు పరార్‌. మార్కెట్‌లలో లభించే మందులను చీమల (ants) కోసం వాడటం కంటే ఇలా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను (tips) పాటించడం వల్ల చీమల బారి నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. మార్కెట్‌లో లభించే మందుల వల్ల మన ఆరోగ్యంపై (health Impact) ప్రభావం పడే అవకాశం ఉందని, పైగా అనవసర ఖర్చు (cost) కూడా అవుతుందని చెబుతున్నారు.

Also Read: ఇంటి ముందు కాకి అరిస్తే ఏం జరుగుతుంది? ప్రత్యేకత ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు