ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు, ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అరుదైన రికార్డులు సాధించిన టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అందువల్ల అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో సాధించిన అరుదైన రికార్డులు తెలుసుకుందాం.
Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
Allu Arjun Rare Records
అల్లు అర్జున్ తెలుగు చిత్ర సీమలో ఏ దిగ్గజ నటుడికి దక్కని అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. 2023లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సాధించాడు. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్‌లో తన పాత్రకు ఈ అవార్డు వరించింది.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో దేశంలోనే రెండో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో బన్నీ ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేసింది. ఇది దాదాపు రూ.1831 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
అల్లు అర్జున్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు ఉంది. అదే "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు. దీనిని బన్నీ 2022లో దక్కించుకున్నాడు. ఈ అవార్డు ఎంటర్‌టైన్మెంట్ కేటగిరీలో లభించింది. దీంతో ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు పొందాడు.
అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. అతడు 2024లో అత్యధిక పారితోషికం దాదాపు రూ.300 కోట్లు తీసుకున్న భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
అల్లు అర్జున్ ఇటీవల 2024లో 74వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ బన్నీ భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి ముఖ్యమైన మైలురాయిని నెలకోల్పాడు. అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. దీంతో దక్షిణ భారతదేశం నుండి ఈ గౌరవం అందుకున్న తొలి నటుడిగా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు.
అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న సౌత్ యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
బన్నీ కెరీర్‌లో అందరికీ గుర్తుండిపోయే చిత్రం దేశముదురు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టేశాడు. దీంతో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరోగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
(telugu-news | latest-telugu-news | hbd-allu-arjun | allu-arjun | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | breaking news telugu)