Fig Fruit : ఇవి నానబెట్టిన నీళ్లను తాగితే.. ఇలా జరుగుతుందా..!

అంజీర్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే వీటిని నానబెట్టిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంజీర్ లోని యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం అధికం. ఇవి గుండె, జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

New Update
Fig Fruit : ఇవి నానబెట్టిన నీళ్లను తాగితే.. ఇలా జరుగుతుందా..!

Fig Fruit Benefits : డైలీ డైట్(Daily Diet) లో డ్రై ప్రూట్స్(Dry Fruits) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వాటిలో ఒకటి అంజీర్(Fig). ఎన్నో రకాల వ్యాధులను నియంత్రించడానికి అంజీర్ ఉత్తమమైన ఎంపిక. వీటిలోని విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవగానే అంజీర్ నానబెట్టిన నీటిని(Fig Fruit Water) తాగితే ఆరోగ్యానికి చాలా లాభాలు(Health Benefits). అవేంటో తెలుసుకుందాము..

అంజీర్ నీటిని తయారు చేసుకునే విధానం

3-4 అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్లను వడకట్టి తాగాలి. అవసరమైతే తేనే కూడా వేసుకొని తాగొచ్చు.

అంజీర్ నీళ్లను తాగితే కలిగే లాభాలు

  • అంజీర్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో అధికంగా ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
  • అంజీరలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
  • విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తాయి. అలాగే చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షిస్తాయి. రోజూ డైట్ లో అంజీర్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు.

Also Read : Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?

publive-image

  • అంజీర్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఎముకల బలహీనతను తగ్గిస్తాయి. ఎముకలకు సంబంధించిన బోలు ఎముకల వ్యాధి, రికెట్స్, ఆస్టియోమైలిటిస్ వంటి వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.
  • వీటిలో క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలో గ్లూకోజ్ నిర్వహణ పై మంచి ప్రభావం చూపిస్తుంది. అలాగే వీటిలోని అధిక ఫైబర్ గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
  • ఇవి అధిక బరువు నియంత్రణకు సహాపడుతుంది. అలాగే వీటిలోని ఫైబర్ గ్యాస్ , యాసిడిటీ, కడుపుబ్బరం, వంటి జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

Also Read: Banana Cup Cake: టేస్టీ, యమ్మీ బనాన కప్ కేక్ .. ఇంత ఈజీనా..! ట్రై చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు