Jobs: బీటెక్ అర్హతతో BELలో జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది. బీటెక్ అర్హత ఉన్న వాళ్లు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు నెలవారీ జీతం ఇస్తారు. By Trinath 19 Aug 2023 in జాబ్స్ New Update షేర్ చేయండి BEL Recruitment 2023 vacancy details: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో ఉద్యోగుల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైంది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా..అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది ఆగస్టు 26. ఆసక్తి ఉన్నవారు https://bel-india.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. CHECK FOR COMPLETE NOTIFICATION HERE ఖాళీల వివరాలు: 57 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. • ట్రైనీ ఇంజనీర్ -I (ఎలక్ట్రానిక్స్) - 08 > ట్రైనీ ఇంజనీర్ -I (మెకానికల్) - 28 • ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I (ఎలక్ట్రానిక్స్) - 08 > ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I (మెకానికల్) - 08 • ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I (సివిల్) - 01 ➼ వయసు: 28- 32 సంవత్సరాలు. ఎలా దరఖాస్తు చేయాలి: ➊ bel-india.in అధికారిక వెబ్‌సైట్‌ను (click here) విజిట్ చేయండి. ➋ హోమ్‌పేజీలో, కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి ➌ అప్లై లింక్‌పై క్లిక్ చేయండి. ➍ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ➎ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి. ➏ దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము: ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ.472, ట్రైనీ ఇంజనీర్‌లకు రూ.177. Also Read: టెన్త్ అర్హతతో 30,000 పోస్టులు..ముగుస్తున్న గడువు.. త్వరపడండి! #jobs #bel-recruitment-2023 #bel-recruitment #bel-recruitment-2023-apply-online #bel-recruitment-2023-for-engineers #bel-notification-2023 #bel-recruitment-notification-2023 #bel-jobs #bel-jobs-apply-online #bel-recruitment-vacancies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి