Cricket: విరాట్ పై ప్రశంసలు కురిపించిన అజిత్ అగార్కర్!

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ మాజీ టీమిండియా ఆటగాడు అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. నేటి యవతకు విరాట్ ఆదర్శమని అగార్కర్ కొనియాడారు. అయితే జూన్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ లో విరాట్ స్థానం గురించి మాత్రం ఎటువంటి ప్రకటన అగార్కర్ విడుదల చేయలేదు.

New Update
Cricket: విరాట్ పై ప్రశంసలు కురిపించిన అజిత్ అగార్కర్!

ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల అతను రాజస్థాన్ పై అద్భుతమైన సెంచరీని కూడా సాధించాడు. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. అయితే ఇందులో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్‌పై చాలా ప్రశంసలు కురిపించారు. విరాట్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాడు.

, అజిత్ అగార్కర్, “విరాట్‌ని  తమ సొంత గుర్తింపును సృష్టించుకున్నారు. గత 10-15 సంవత్సరాలలో, అతను ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సాధించాడు. నేటి యువ ఆటగాళ్లు విరాట్ ను ఆదర్శంగా తీసుకుని  ఫిట్ నెస్ ను సాధిస్తున్నారు.అతను చాలా మంది ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని అగార్కర్ కొనియాడాడు. “ నేటి తరం యువకులు 15-16 సంవత్సరాల వయస్సులో చాలా ఫిట్‌గా మారతారు. వారికి ఇప్పుడు అవకాశం దక్కింది.విరాట్ లాంటి ఆటగాడు మీతో ప్రయాణిస్తున్నాడు.అతనిని నుంచి మీరు ఎంతో నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని అగార్కర్ పేర్కొన్నాడు.అయితే ప్రస్తుతం ఇండియన్  ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ ఆధిపత్యం కొనసాగుతుంది. కింగ్ కోహ్లీ ఐపీఎల్ 2024లో అత్యధికంగా 316 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ (ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్)ను అతడు సొంతం చేసుకున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు