బీ అలర్ట్: రానున్న 2 గంటలు హైదరాబాద్లో జోరు వాన..!

గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఎండలు దంచుతుంటే..ఇప్పుడు సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తొమ్మిది గంటల వరకు కూడా ఎండగానే ఉండగా.. తరువాత నగరం మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. అయితే నగర వ్యాప్తంగా రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు జిల్లాలోను భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు..

New Update
బీ అలర్ట్: రానున్న 2 గంటలు హైదరాబాద్లో జోరు వాన..!

Rains in Hyderabad : గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఎండలు దంచుతుంటే..ఇప్పుడు సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తొమ్మిది గంటల వరకు కూడా ఎండగానే ఉండగా.. తరువాత నగరం మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. వాతావరణం చల్లబడి.. చల్లని గాలులు వీస్తున్నాయి.

మరోవైపు నగరంలో ఆకాశం మేఘావృతం కావడంతో పలు చోట్ల వర్షం కూడా పడుతోంది. భరత్ నగర్ ,మాదాపూర్ ,టోలిచౌకి , రాజేంద్ర నగర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో పాటు పంజాగుట్ట, అమీర్ పేట్, షేక్ పేట్, ఉప్పల్ లలో కూడా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది.

అయితే నగర వ్యాప్తంగా రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ Hyderabad Meteorological Department అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు జిల్లాలోను వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, జోగులాంబ, నాగర్ కర్నూల్, మెదక్, సిద్దిపేట్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, ఇంకా భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది.

Also Read: జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంటి..వీడియో వైరల్ !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Revanth Reddy : కుల గణన మోడీకి మరణ శాసనం...సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరవుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.

New Update
CM

CM Revanth Reddy

CM Revanth Reddy :ఎస్సీ వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మోడల్ పై దేశంలో చర్చజరుగుతుందని, తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరి అవుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని ముఖ్యమంత్రి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ ఆరోపించారు.

Also Read: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని సీఎం తెలిపారు.సన్నబియ్యం పథకం ఒక అద్భుతమన్న రేవంత్ 
ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమన్నారు. భూ భారతిని రైతులకు చేరవేయాలని,దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలని, దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. 

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామన్న రేవంత్ రెడ్డి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామన్నారు. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు.జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని,  అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క  ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది.రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం కావడానికే సమయం కేటాయిస్తానని సీఎం స్పష్టం చేశారు.

Also Read: Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని, ఈ ప్రచారాన్ని నమ్మి ప్రధాని మోదీ కూడా బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారన్నారు.బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తు్న్నాయని ఆరోపించారు.పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందన్న రేవంత్ మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్నారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 

Also Read: తిరుమల లడ్డూను ఎంత జాగ్రత్తగా, పవిత్రంగా తయారు చేస్తున్నారో చూడండి.. వీడియో విడుదల చేసిన TTD!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు