Skin Care Tips: ముఖంపై నల్లటి మచ్చలకు ఇలా చెక్ పెట్టండి!

మొటిమల ద్వారా ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు శరీర సౌందర్యాన్ని తగ్గిస్తాయి. అలోవెరా జెల్, తేనె, పసుపు, పెరుగు, వేప ఆకులు వంటి సహజమైన హోం రెమెడీస్ మచ్చలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Care Tips: ముఖంపై నల్లటి మచ్చలకు ఇలా చెక్ పెట్టండి!

Skin Care Tips: నల్లటి మొటిమలు మీ ముఖ అందంపై ప్రభావం చూపుతాయి. నేటికాలంలో ప్రతి ఒక్కరూ తమను అందంగా మార్చుకోవడానికి ఖరీదైన బ్యూటీ వస్తువులను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిని వాడినప్పటికీ కొందరికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు. నల్లటి మొటిమలు ముఖ సౌందర్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అయితే ఈ సమస్యనుంచి బయటపడేందుకు కొన్ని హోం రెమెడీస్ ప్రయత్నిస్తే ముఖ సౌదర్యం పెరుగుతుంది. మరి సహజమైన హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం.

అలోవెరా జెల్:

  • నల్లటి మొటిమల రంధ్రాల్లోకి దుమ్ము చేరడం వల్ల నల్ల మచ్చలుగా మారుతాయి. అయితే కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటంతో వీటి నివారణకు ఎంతో మేలు చేస్తాయి. అలోవెరా జెల్‌ను నల్లటి మొటిమల మీద అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి కొంత సమయం తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.

వేప ఆకులు:

  • ముఖానికి వేప ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై చేరిన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ముఖంపై మొటిమల వాపును తగ్గిస్తుంది. వేప ఆకులను పేస్ట్ చేసి ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇందులో కాస్త పసుపు చేర్చుకోవచ్చు.

తేనె:

  • నల్ల మొటిమలను వదిలించుకోవడానికి తేనె బెస్ట్‌. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నయం చేయడంలో ఎంతగానో సహకరిస్తాయి. స్వచ్ఛమైన తేనెను ముఖానికి ఒక 5 నిమిషాలు మర్దన చేయడం వల్ల నల్లటి రంధ్రాల్లోకి వెల్లి కొవ్వును కరిగిస్తుంది.

పెరుగు:

  • పెరుగులో ఉంటే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరచడంలో ఎంతో సహాయపడుతుంది. పెరుగును ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. దీనితో నల్లటి మొటిమల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

ప్యాచ్‌ టెస్ట్ ముఖ్యం:

  • ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి వారి ముఖంపై కలబంద, పెరుగు, తేనె వంటి వాటిని ఉపయోగించడం వల్ల అలెర్జీ రావచ్చు. అందువల్ల ఏదైనా ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలని స్కిన్ స్పెషలిస్ట్ చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు