Kannada vs English: ఇంగ్లీష్‌ నేమ్‌బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్‌ వార్‌!

బెంగళూరులోని అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాల నేమ్ బోర్డులపై తప్పనిసరిగా 60శాతం కన్నడను ఉపయోగించాలని బీబీఎంపీ ఆదేశించింది. అందుకు ఫిబ్రవరి 28వరకు టైమ్‌ ఇవ్వగా.. కన్నడ కార్యకర్తల మాత్రం ఇవాళే రచ్చచేశారు. ఇంగ్లీష్ సైన్ బోర్డులను చింపివేశారు.

New Update
Kannada vs English: ఇంగ్లీష్‌ నేమ్‌బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్‌ వార్‌!

భాష(Language)ను కాపాడుకోవడం ముఖ్యమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే భాషపై ప్రేమ పేరిట అమాయకులపై దాడులు చేయడం... ఆస్తులను ధ్వంసం చేయడం నేరం అవుతుంది. భాషను అమితంగా ప్రేమంచే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు(Tamilnadu), కర్ణాటక(Karnataka)లో గతంలో చాలా సార్లు భాష కోసం ఆందోళనలు జరిగాయి. అటు ఈ రెండు రాష్ట్రాలకు చెందని చిత్ర పరిశ్రమ సైతం తెలుగు భాషకు సంబంధించిన సినిమాల విషయంలో ఫైటింగ్‌లకు దిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బృహత్ బెంగళూరు(Bagalore) మహానగర పాలికే (బీబీఎంపీ) తీసుకున్న ఓ నిర్ణయంతో అక్కడ మరోసారి లాంగ్వేజ్‌ వార్‌ మొదలైంది.


60శాతం కన్నడ తప్పనిసరి:
షాపులపై సైన్‌బోర్డులు(నేమ్‌బోర్డు) ఉంటాయి.. వాటిపై షాపుకు సంబంధించిన డీటెయిల్స్‌ అక్షరాల రూపంలో ఉంటాయి. బెంగళూరులోని చాలా సైన్‌బోర్డులు మొత్తం ఇంగ్లీష్‌(English)లోనే ఉంటున్నాయని కన్నడ(Kannada) అనుకూల కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఓ నిర్ణయం తీసుకుంది. సైన్‌బోర్డులపై 60శాతం కన్నడ అక్షరాలు ఉండాలని నిబంధన పెట్టింది. ఫిబ్రవరి 28, 2024లోపు ఈ నిబంధనకు విరుద్ధంగా ఉన్న బోర్డులను మార్చుకోవాలని తెలిపింది. నిన్ననే దీనికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేసింది.


బోర్డులను చించేశారు:
ఫిబ్రవరీ 28 వరకు నేమ్‌బోర్డులను మార్చుకునే వెసులుబాటును కల్పించింది బీబీఎంపీ. అయితే ఇవేవీ పట్టించుకోని కన్నడ అనుకూల కార్యకర్తలు నిరసనగా వీధుల్లోకి వచ్చారు. ఇంగ్లీష్‌బోర్డులు కనిపిస్తే చాలు ఆ షాపును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నిన్న ఆదేశించి ఇవాళే తీసేమంటే ఎలా అని సంబంధిత షాప్‌ నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వినిపించుకోని కన్నడ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. వారి హింసాత్మక నిరసనలతో కర్ణాటకలో భాషా వివాదాలు తీవ్రమయ్యాయి. కొందరు కార్యకర్తలు ఇంగ్లీష్ సైన్ బోర్డులను చింపివేయగా, మరికొందరు ఆంగ్ల అక్షరాలపై నల్ల ఇంకు చల్లారు. చాలా మంది నిరసనకారులు, ఎక్కువగా పసుపు, ఎరుపు కండువాలు (కన్నడ జెండా రంగులు అవి) ధరించి షాపుల్లోకి ప్రవేశించి రచ్చ చేశారు. అయితే పోలీసుల జోక్యంతో ఆందోళన ఆగిపోయింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు అధికారులు లాఠీచార్జి చేసి కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అన్ని హోటళ్లు, మాల్స్ మరియు ఇతర దుకాణాలు తప్పనిసరిగా తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, నగర పౌర సంఘం ఆదేశించింది, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: రెజ్లర్లను కలిసిన రాహుల్‌ గాంధీ.. ఆ విషయంపైనే చర్చించారన్న పునియా

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు