Actress Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. మంచు విష్ణు కీలక ప్రకటన! నటి హేమకు ఊరట లభించింది. బెంగుళూర్ రేవ్ పార్టీ వార్తల నేపథ్యంలో ఆమెపై విధించిన సస్పెన్షన్ ను 'MAA' ఎత్తివేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు లేఖను విడుదల చేశారు. అలాగే పరిస్థితుల కారణంగా స్పెన్షన్, దాని ఎత్తివేత గురించి మీడియాతో చర్చించకూడదని తెలిపారు. By Archana 23 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actress Hema: సినీ నటి హేమ రీసెంట్ గా బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ వీడియోను రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత అసలు విషయం కనిపెట్టిన పోలీసులు హేమ కూడా రేవు పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపెట్టారు. దీంతో విచారణ కోసం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు 'MAA' నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించారు. హేమకు గుడ్ న్యూస్.. అయితే తాజాగా హేమకు 'MAA' శుభవార్తను చెప్పింది. ఆమె సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. కాగా , ఇటీవలే డ్రగ్స్ విషయంలో హేమకు రక్త పరీక్షలు నిర్వహించగా తనకు నెగెటివ్ వచ్చిందని ఆమె సోషల్ మీడియాలో రిపోర్టులను షేర్ చేసింది. ఆపై ఆమెకు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు. ఇక ఈ విషయాలనన్నీ పరిగణలోకి తీసుకున్న 'మా' హేమ సస్పెన్షన్ ను తిరిగి విచారించారు. కమిటీ సభ్యులతో చర్చల తర్వాత 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆమె సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాల గురించి మీడియా, ప్రెస్ తో చర్చించకూదని సూచించారు. Also Read: VIDAAMUYARCHI : 'విదాముయార్చి' రిలీజ్ అప్డేట్ .. వైరలవుతున్న పోస్టర్ - Rtvlive.com #actress-hema #hema-suspension సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి