Traffic Rules: జాగ్రత్త.. సిగ్నల్‌ జంప్‌ చేస్తే బాస్ కు చెప్తారట!

బెంగళూరు టెకీలకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. వారెవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్ వేసి వదిలేయకుండా పనిచేస్తున్న కంపెనీకి కంప్లైంట్ ఇస్తారట. సిగ్నల్‌ జంప్‌, అతివేగంతో దూసుకుపోవడాన్ని అస్సలు ఉపేక్షించేది లేదంటున్నారు బెంగళూరు పోలీసులు.

New Update
Traffic Rules: జాగ్రత్త.. సిగ్నల్‌ జంప్‌ చేస్తే బాస్ కు చెప్తారట!

Traffic Rules: బెంగళూరు టెకీలకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. విపరీతంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు జరుగుతున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికొచ్చారు. టెకీలెవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్ వేసి వదిలేయకుండా వారు పనిచేస్తున్న కంపెనీకి కంప్లైంట్ ఇస్తారట. సిగ్నల్‌ జంప్‌, అతివేగంతో దూసుకుపోవడాన్ని అస్సలు ఉపేక్షించేది లేదంటున్నారు బెంగళూరు పోలీసులు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బెంగళూరు ఈస్ట్ డివిజన్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ సరికొత్త వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, వైట్ ఫీల్డ్‌లో ఈ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టబోతున్నారు. అది సక్సెస్ అయితే నగరమంతటా విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: IPL: ముంబై ఇండియన్స్ కు షాకిచ్చిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. అంత కోపం ఎందుకంటే!

టెకీలు ఎక్కువగా ఉండే, ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు జరిగే ఈస్ట్ డివిజన్ ప్రాంతాన్ని ట్రాఫిక్ పోలీసులు పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఏ టెకీ అయినా ఇకపై రూల్స్ ఉల్లంఘిస్తే ఐడీ కార్డు ఆధారంగా ఆ సమాచారాన్ని కంపెనీకి ఇ-మెయిల్‌, వాట్సప్‌ ద్వారా చేరవేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కంపెనీలు కూడా ట్రాఫిక్ రూల్స్ పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు