Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్‌!

ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి స్పెషల్‌ మొబైల్‌ కోర్టు బెయిల్ ఇచ్చింది. అటు బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ప్రజాజీవితంలో కానీ, పని ప్రదేశంలో కానీ ఏ మహిళకైనా ప్రశ్నార్థకమైన వ్యక్తిత్వం ఉంటుందని నమ్మే బండారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని రోజా మీడియా సంస్థలను సైతం ప్రశ్నించారు. చంద్రబాబు స్వయంగా మహిళలను అగౌరవపరుస్తున్నారని రోజా ఆరోపించారు.

New Update
Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్‌!

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Bandaru satyanarayana)కి బెయిల్‌(bail) ఇచ్చింది కోర్టు. స్పెషల్‌ మొబైల్‌ కోర్టు బండారుకు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సీఎం జగన్‌, మంత్రి రోజా(Roja)పై అనుచిత వ్యాఖ్యల కేసులో నిన్నంతా విశాఖలో బండారు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. చాలాసేపటి తర్వాత నిన్న రాత్రి అరెస్ట్‌ చేసి గుంటూరకు తరలించారు పోలీసులు. అంతకముందు గుంటూరు జీజీహెచ్‌లో మాజీ మంత్రికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు బండారును తీసుకెళ్లగా.. కోర్టు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైకోర్టులో విచారణ వాయిదా:
మాజీమంత్రి బండారు సత్యనారాయణ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బండారు సత్యనారాయణ అరెస్ట్ అక్రమంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయన తరుపు లాయర్ వివి సతీష్. బండారు సత్యనారాయణ విచారణకు సహకరించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పారు. రెండు కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం తరుపు న్యాయవాది తెలిపారు. ఒక కేసులో సహకరించలేదని.. అందుకే అరెస్ట్ చేశామని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. 41ఏ నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని పిటిషనర్ తరుపు న్యాయవాది వి వి సతీష్ ప్రశ్నించారు. ఇక కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

రోజా ఆగ్రహం:
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి తొలిసారి స్పందించారు. హై డ్రామా నడుమ టీడీపీ నేతను ఆయన నివాసంలో అరెస్టు చేశారు. తనపై ఇలాంటి నీచమైన, చౌకబారు ఆరోపణలు చేయడం ఏంటని రోజా ప్రశ్నించారు. బండారు చేసిన వ్యాఖ్యలపై భావోద్వేగానికి గురయ్యారు. ప్రజాజీవితంలో ఉన్న మహిళ వ్యక్తిత్వ హత్యను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. బండారుపై పరువు నష్టం దావా వేస్తానని, న్యాయం కోసం పోరాడుతానని చెప్పిన రోజా టీడీపీ నేతలు మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో జగన్ పై టీడీపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బండారు బురదజల్లే వ్యాఖ్యలు చేశారని రోజా అన్నారు. కోర్టుకు వెళ్లి తాము ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలని కోరారు. చంద్రబాబు స్వయంగా మహిళలను అగౌరవపరుస్తున్నారని ఆరోపించిన రోజా గతంలో చేసిన వ్యాఖ్యలు, చర్యలకు టీడీపీ నేతలు చింతమనేని, అచ్చంనాయుడు, బాలకృష్ణ, నారా లోకేశ్ పేర్లను కూడా ప్రస్తావించారు.

ALSO READ: ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ..బండారు అరెస్ట్.. నెక్ట్స్ ఏం జరగబోతోంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు