BREAKING: తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును మంత్రి శ్రీధర్‌ బాబు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

New Update
BREAKING: తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

Hookah Ban: అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కీలక బిల్లు పాస్‌ అయ్యింది. తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేధం విధించే సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. హుక్కా సెంటర్లపై నిషేధం అవసరమని నొక్కి చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. యువత హుక్కాలకు అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. పొగ కంటే హుక్కా మరింత హానికరమన్నారు. నిజానికి ఈ ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే హుక్కా నిషేధంపై నిర్ణయం తీసుకుంది.. దానికి ఇవాళ సభ నుంచి ఆమోదం లభించింది.

హుక్కాలో బొగ్గును ఉపయోగించడం వల్ల ఆ పొగలో కార్బన్ మోనాక్సైడ్, హెవీ మెటల్స్, క్యాన్సర్ కారకాలు అనే రసాయనాలు ఉంటాయి. పొగ హుక్కా స్మోకర్లకే కాదు, పాసివ్ స్మోకర్లకు కూడా హానికరం. హుక్కా పార్లర్‌లు, బార్‌లు బహిరంగ ప్రదేశాల్లో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని చెప్పారు. హుక్కాలో బొగ్గును ఉపయోగించడం వల్ల ఆ పొగలో కార్బన్ మోనాక్సైడ్, హెవీ మెటల్స్, క్యాన్సర్ కారకాలు అనే రసాయనాలు ఉంటాయి. పొగ హుక్కా స్మోకర్లకే కాదు, పాసివ్ స్మోకర్లకు కూడా హానికరం. హుక్కా పార్లర్‌లు, బార్‌లు బహిరంగ ప్రదేశాల్లో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని చెప్పారు. అందుకే హుక్కా బార్లను నిషేధించడం లాంటి కఠిన చర్యలు అవసరమని ప్రభుత్వం భావించిందన్నారు.

Also Read: పేటీఎం కష్టాలు పెరుగుతున్నాయి.. చైనా లింకులపై దర్యాప్తు!

Advertisment
Advertisment
తాజా కథనాలు