Telangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఈరోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు తీసుకున్న సుమన్ కేసులకు అసలే భయపడనని చెప్పారు.

New Update
Telangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే

Balka Suman : బీఆర్ఎస్ మాజీ బాల్క సుమన్(Balka Suman) కు ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సుమన్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈరోజు సుమన్ కు మంచిర్యాల ఎస్సై నోటీసులు(Notices) ఇచ్చారు.

కేసులకు అసలే బయపడను..
ఈ మేరకు స్వయంగా సుమన్ ఇంటికెళ్లిన పోలీసులు ఇందుకు సంబంధించిన కేసులో నోటీసులు అందించారు. అయితే స్వయంగా నోటీసులు అందుకున్న బాల్క సుమన్ ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడుతూ.. కేసులకు అసలే బయపడనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కావాలనే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ(Telangana) ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, ఇలాంటి వాటికి తాను ఆందోళన చెందే వ్యక్తిని కాదన్నారు. అలాగే రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ అంటూ.. తమ నాయకులు ఎవరూ కేసులకు భయపడరని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి : GHMC : గ్రేటర్‌ హైదరాబాద్‌పై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్‌.. కార్పొరేటర్ లే టార్గెట్!

అసలేం జరిగింది..
మంచిర్యాల(Mancherial) జిల్లాలో బీఆర్ఎస్(BRS) పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ దుర్భాషలాడారు. సంస్కారం అడ్డువస్తోందంటూనే అసభ్యపదజాలంతో ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాల్కసుమన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు.. మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సుమన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. కేసుతో పాటు సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే బాల్క సుమన్‌ను మంచిర్యాలలో తిరగినివ్వమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు