/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/balineni-jpg.webp)
Balineni Srinivasa : ఏపీలో ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కొత్త వారి పేర్లు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని వైసీపీ (YCP) అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మాగుంటకే (Magunta Srinivas) ఎంపీ సీటు ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఎంపీ రేసులోకి రోజా, చెవిరెడ్డి పేర్లు వినిపిస్తుండడంతో ఆయన పార్టీని విడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు – పవన్ కసరత్తు
ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఓ ప్రవేటు హోటల్ లో బాలినేనితో సజ్జల (Sajjala Rama Krishan reddy) భేటీ అయ్యారు. సుమారు గంటపాటు విరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోకపోతే బాలినేని వైసీపీకి గుడ్ బై చెబుతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ తరువాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఆపరేషన్ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా..?
2019 ఎన్నికల ముందు మాగుంటను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో బాలినేని కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సారి మాగుంటకు టికెట్ లేదని పార్టీ అధిష్టానం చెప్పడంతో బాలినేని రంగంలోకి దిగారు. తన టికెట్‌తో పాటు, ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకే ఇవ్వాలని పట్టుపడ్డారు. సీఎం జగన్‌తో పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకపోయింది. బాలినేనికి ఒంగొలు అసెంబ్లీ సీటు ఇచ్చినా.. మాగుంట స్థానంలో చెవిరెడ్డి లేదా రోజాను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.