drug case: నవదీప్ డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది. By Karthik 21 Sep 2023 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది. అంతే కాకుండా కలహర్ రెడ్డి, సూర్య ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో నటుడు నవదీప్ చుట్టు డ్రగ్స్ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంది. హైకోర్టులో అతను వేసి పిటిషన్ కొట్టివేయండతో నార్కోటిక్ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. ఎక్కడున్నా వెంటనే హైదరాబాద్ కు తిరిగిరావాలని చెప్పారు. డ్రగ్స్ కేసుకు తనకూ ఏం సంబంధం లేదని, విచారణకు హాజరు కానని హైకోర్టులో నవదీప్ పిటిషన్ వేశారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని.. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు అసలు ఎలాంటి సంబంధం లేదని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ వాదించారు. కానీ కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా నవదీప్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ నవదీప్ బుకాయిస్తున్నారని వారు చెబుతున్నారు. నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నటుడు పోలీసు విచారణకు ఏ మేరకు సహకరిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా మాదాపూర్ పోలీసులు నిర్వహించిన రైడ్‌లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను డ్రగ్స్ వాడినట్లుగా గుర్తించారు. పోలీసుల ఆపరేషన్‌లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ విషయం బయటపడింది. దీంతో నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. #bail #surya #navdeep #drug-case #kalahar-reddy #snart-pub #yajamani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి