Baby Rathee coming: తల్లి దండ్రులు కాబోతున్న యూట్యూబర్ ధృవ్ రాఠీ, భార్య జూలీ ఎల్‌బిఆర్ 

సుప్రసిద్ధ యూట్యూబర్ ధృవ్ రాఠీ- అతని భార్య జూలీ ఎల్‌బిఆర్ తల్లి దండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వారు "బేబీ రాఠీ సెప్టెంబర్‌లో వస్తోంది" శీర్షికతో చేసిన పోస్ట్ ద్వారా తమ ఫాలోవర్స్ కు తెలిపారు.

New Update
Baby Rathee coming: తల్లి దండ్రులు కాబోతున్న యూట్యూబర్ ధృవ్ రాఠీ, భార్య జూలీ ఎల్‌బిఆర్ 

Baby Rathee coming:  సుప్రసిద్ధ యూట్యూబర్ ధృవ్ రాఠీ - అతని భార్య జూలీ ఎల్‌బిఆర్, తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్  Instagram, Xలో ప్రకటించారు. ఈ పోస్ట్ లో జూలీకి సంబంధించిన మంచి ఫోటోలను షేర్ చేశారు ధృవ్. ఈ ఫోటోలలో  జూలీ గ్రే స్లీవ్‌లెస్ బాడీకాన్ డ్రెస్‌ను ధరించి, తన బేబీ బంప్‌తో అత్యంత సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. తల్లి కాబోతున్న తన ఆనందాన్ని తన ఫాలోవర్స్ కు పంచుతున్నట్టుగా ఈ ఫోటోలు ఉన్నాయి. 

Baby Rathee coming:  ఈ జంట ఫోటోలలో ఆనందంతో వెలిగిపోతున్నారు.  జూలీ మెరుస్తున్న రూపంతో ఆమె తల్లి కావడం పట్ల ఆమె ఆనందాన్ని ప్రతిబింబిస్తోంది. సెప్టెంబరులో తమ బిడ్డ జన్మిస్తుందని జూలీ వెల్లడించింది.  "బేబీ రాఠీ సెప్టెంబర్‌లో వస్తోంది" అనే శీర్షికతో పోస్ట్ ను షేర్ చేసుకుంది జూలీ. 

View this post on Instagram

A post shared by Juli Lbr-Rathee (@juli_lbr)

Baby Rathee coming:  ఈ పోస్ట్ వచ్చిన వెంటనే, నెటిజన్లు ఈ జంటను తల్లిదండ్రులు అవుతున్నందుకు అభినందించారు. ఒక సోషల్ మీడియా వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, “అద్భుతమైన వార్త, ధృవ్. మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు. ” ఇక మరో నెటిజన్  "వెచ్చని అభినందనలు" అని శుభాకాంక్షలు చెప్పారు. మరో అభిమాని.. "మీ ఇద్దరికీ ఇది చాలా ఆనందం కలిగించే విషయం." అని పేర్కొన్నారు. అదేవిధంగా చాలామంది నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో స్పందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

#dhruv-rathee #youtuber
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Kangana Ranaut: కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బి...

Kangana Ranaut: కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!

నటి కంగనా రనౌత్ మనాలిలోని తన ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అసలు తాము నివాసమేలేని ఇంటి అంత బిల్లు ఎలా వచ్చిందంటూ మండిపడ్డారు.

New Update
Kangana Ranaut on getting 1lakh electricity bill

Kangana Ranaut on getting 1lakh electricity bill

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓవైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో జరిగిన ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరైన కంగనా.. మనాలిలోని తన ఇంటికి  రూ. లక్ష కరెంట్ బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెలవారీ విద్యుత్ బిల్లు రూ. లక్ష దిగ్భ్రాంతికరమైన విషయమని పంచుకున్నారు. తాను ప్రస్తుతం నివసించని ఇంటికి రూ. లక్ష బిల్లు విధించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని  విమర్శించారు.  రాష్ట్రంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటని అన్నారు. నా సోదర, సోదరీమణులు నేను కోరేది ఒక్కటే మనమంతా ఇలాంటి సమస్యలపై  క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత మనది అని తెలిపారు. 

 latest-news | telugu-news | actress-kangana-ranaut 

Advertisment
Advertisment
Advertisment